ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం

నల్లచెరువు వద్ద నివాసముంటున్న అటో డ్రైవర్ గౌరీశంకర్ అదే వీధిలో ఉంటున్న మతిస్థిమితం లేని యువతిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని నిందితున్ని పోలీసులకు అప్పగించారు. చికిత్స నిమిత్తం యువతిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాగా, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన ఓ గిరిజన వివాహితపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వెంటనే మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
సోమవారం రాత్రి పొలానికి వెళ్తున్న మహిళపై ఆమె బంధువులు ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన మహిళ బంధువులు ఆగ్రహంతో నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications