ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఆపై దారుణ హత్య

వివరాలు ఇలా ఉన్నాయి - కోమటిబండ గ్రామంలోని మేకిన్స్ వ్యవసాయ క్షేత్రానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో గురువారం ఉదయం దాదాపు 35 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ఇద్దరు గుర్తు తెలియని మహిళల శవాలు పడి ఉండడాన్ని గ్రామస్థులు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలంో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసా పెంకులు, గిఫ్ట్ బాక్స్, మహిళలకు చెందిన చీరెల సంచీ ఉన్నాయి. ఇద్దరు మహిళకు కూడా మద్యం తాగించి అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు గాజు పెంకులతో ముఖాలను కోశారు.
సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఓ మహిళను జగదేవ్‌పూర్ మండలం చేబర్తి గ్రామస్తురాలిగా గుర్తించారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొని వస్తుండగా దుండగులు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications