Continental Hospitals: హైదరాబాద్ లో జాతీయ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమావేశాలు..
హైదరాబాద్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన జాతీయ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జూన్ 28 నుంచి 30 వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలను కాంటినెంటల్ హాస్పిటల్స్ తో కలిసి నేషనల్ జీఐ కాన్ఫరెన్స్ ను సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశాల్లో అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విద్యా, వైద్య కేంద్రం మయో క్లినిక్, ఆక్స్ ఫోర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు, దేశ విదేశాల నుంచి పాల్గొన్న 500 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, మేధావులు పాల్గొన్నారు.
వైద్య నిపుణులు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో వస్తున్న సరికొత్త వైద్యసేవలు, వ్యాధుల నిర్మూలన ప్రక్రియల గురించి ఈ సమావేశాల్లో లోతుగా చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక వైద్యసేవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంటినెంటల్ హాస్పిటల్స్, నేడు గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సరికొత్త ఆవిష్కరణలకు దోహదపడే జాతీయ గ్యాస్ట్రోఎంట్రాలజీ సమావేశాలను నిర్వహించడం గొప్ప విషయమని గురు ఎన్ రెడ్డి తెలిపారు. జన్యుశాస్త్రంలో వేగంగా వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు, వాటి ద్వారా మారుతోన్న వైద్య విధానాలు మన భవిష్యత్ వైద్యరంగాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లనున్నాయని చెప్పారు.

కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జీఐ కాన్ఫరెన్స్.. రేపు రాబోయే ఎన్నో కొత్త ఆవిష్కరణలకు మూలం కాబోతుందన్నారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ల గురించి, పెద్దప్రేగు, అన్నవాహిక, కడుపు, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించే రోగనిర్ధారణ పరీక్షలు, వాటికనుగుణంగా చేసే అడ్వాన్స్ ట్రీట్ మెంట్ గురించి గురు ఎన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి నెల నుంచే కాంటినెంటల్ హాస్పిటల్స్ లో దీనికి సంబంధించిన టెస్ట్ లు, కావాల్సిన ట్రీట్ మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
దాదాపు 450 కి పైగా పరిశోధనాత్మక ప్రచురణలు చేసిన రచయిత, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ వైద్య, విద్యా కేంద్రమైన మయో క్లినిక్ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ జాన్ కీసీల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పెద్దప్రేగు క్యాన్సర్ కమ్యూనిటీస్ మీద ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. జాన్ ప్రసంగాన్ని గురు ఎన్ రెడ్డిగారు కొనియాడారు. ఇలాంటి ప్రసంగాలు రేపటి తరాలకు చాలా అవసరమని తెలిపారు. యూఎస్, ఆక్స్ఫర్డ్, లండన్, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు అధునాతన రోగనిర్ధారణ, వినూత్నవైద్యచికిత్సలు, చికిత్సా వ్యూహాలపై వారి అభిప్రాయాలను తెలియజేశారు.

పేషెంట్ కేర్ స్టాండర్డ్స్ ను ఇంకా పటిష్టం చేయడానికి అవసరమైన వైద్యపరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అంశాలు, టెక్నాలజీతో కూడిన వైద్యసేవలు, వైద్యసాధనాలు, నైపుణ్యాలను దేశవ్యాప్తంగా అందించాలని పలువురు మేధావులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం వైద్యులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం, వైద్యపరిజ్ఞానాన్ని పంచుకోవడం కోసం ఉపయోగపడుతుందని గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడం, ముఖ్యంగా జీర్ణకోశ, కాలేయం, నాన్ కమ్యూనికేబుల్ డిజార్డర్ పరిష్కరాల లక్ష్యంగా సమావేశం జరిగింది. అలాగే పరిశోధన నుండి క్లినికల్ అప్లికేషన్ల వరకు వైద్యరంగం మీద జన్యు విప్లవం ప్రభావం ఎలా ఉండబోతుందో కూడా సుదీర్ఘంగా ఈ సదస్సులో చర్చించారు.

ఈ జాతీయ సమావేశం.. భవిష్యత్ వైద్య విధానాలను ప్రభావితం చేసే కొత్త ఆవిష్కరణలను చర్చించడానికి అధ్యాపకులను ఆహ్వానించింది. వైద్యులు ఈ మార్పులను అర్థం చేసుకుని, వాటిని వారి క్లినిక్లలో అమలు చేసి, వైద్యపరమైన పురోగతిని పొందడంలో ఈ కాన్ఫరెన్స్ వారికి తప్పక సహాయపడుతుందని వివరించింది. ఇది రోగులకు మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ, చికిత్సను పొందేందుకు వీలు కల్పించనుంది. మూడు రోజులపాటు జరిగిన ఈ జాతీయ గ్యాస్ట్రోఎంట్రాలజీ సదస్సులో వైద్యరంగానికి సంబంధించిన ఎన్నో మంచి మంచి విషయాల గురించి లోతుగా విశ్లేషించారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం వల్ల మాకు చాలా కొత్త విషయాలు తెలిశాయని దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు తెలిపారు.












Click it and Unblock the Notifications