తానా స్వీయ సాహిత్య వేదిక

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగు ఆసోయేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) తెలుగు కాన్ఫరెన్స్‌లో వివిధ కార్యక్రమాలతో పాటు సాహిత్య కార్యక్రమాలు కూడా వుంటాయి. రచయితలు, కవులు, సాహిత్యాభిలాషుల కోసం తానా సభల సాహిత్య కమిటీ స్వీయ సాహిత్య వేదికను నిర్వహిస్తోంది. తెలుగు అసోయేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు కాన్ఫరెన్స్‌ ఫిలడెల్ఫెయాలో జూన్‌ 29 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ వేదిక మీది నుంచి ఉత్తర అమెరికాలోని సాహితీవేత్తలు తమ రచనలను చదివి వినిపిస్తారు. దీంతో పాటు పలు ఇతర సాహిత్య కార్యక్రమాలు కూడా వుంటాయి.

కాన్ఫరెన్స్‌ లిటరరీ కమిటీ చైర్‌పర్సన్‌గా న్యూజెర్సీలోని స్టీవెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అప్పాజోస్యుల సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. త్రిగుణ అష్టావధానం చేయడానికి డాక్టర్‌ గరికపాటి సత్యనారాయణను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ సత్యనారాయణ చెప్పారు. తానా సభల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సాహితీవేత్తలు ఏలూరిపాటి అనంతరామయ్య, డాక్టర్‌ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇంద్రగంటి జానకీబాల, డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, గరికపాటి సుబ్బ నరసింహశాస్త్రి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, కె. శివారెడ్డి, నాగభైరవ కోటేశ్వరరావు, యార్లగడ్డ బాలగంగాధరరావు, కామేశ్వరి భమిడిపాటి పాల్గొంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి