యార్లగడ్డ ద్రౌపది వివాదం

అవార్డుకు ఎంపిక చేయడానికి తెలుగులో పలు ఉదాత్త రచనలుండగా యార్లగడ్డ ద్రౌపది నవలను ఎంపిక చేయడాన్ని తెలుగు సాహిత్య లోకం తప్పు పడుతోంది. పౌరాణిక ఇతివృత్తాలపై విమర్శలు పెట్టాల్సి వచ్చినప్పుడు హేతుబద్దత అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అటువంటి హేతుబద్దత ఏదీ ద్రౌపది ఇతివృత్తానికి లేదని అంటున్నారు. సదాశివ యాది, కొలుకలూరి ఇనాక్ అస్పృశ్యగంగ వంటి పుస్తకాలు ఎన్నో అవార్డుకు అర్హమైనవి ఉన్నాయని వాదిస్తున్నారు.
ద్రౌపది పాత్ర చిత్రణ కూడా ఎబ్బెట్టుగా ఉందని, ద్రౌపది వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా యార్లగడ్డ రచన ఉందని అంటున్నారు. మహా భారతంలో వ్యక్తిత్వం ఉండి, స్వతంత్రంగా వ్యవహరించిన స్త్రీ పాత్ర ద్రౌపది అని, ఆ ద్రౌపది పాత్రను కూడా చులకన చేసే వ్యాఖ్యలు రచనలో ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే, వివాదం చెలరేగిన చాలా రోజుల వరకు యార్లగడ్డ నోరు మెదపలేదు. ఆ తర్వాత తన రచనలో తప్పేమీ లేదని, తాను ద్రౌపది పాత్రను కించపరచలేదని ఆయన ఇటీవల వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications