వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత్వం నాకో మాయలాంతరు లాంటిది పార్ట్-2

By Pratap
|
Google Oneindia TeluguNews

Vegunta Mohan Prasad
వినండి మరోసారి నా మహాకవి మాటలు!
Between the conception
And creation
Between the emotion
And the response
Falls the shadow

నా కవిత్వమంతటా ఆ వెలుగునీడల సయ్యాటలో భావ ధారణకీ భాషాసృష్టికీ మధ్యలో భావావేశానికీ ప్రతిస్పందనకీ మధ్యలో భావావేశానికీ ప్రతిస్పందనకీ మధ్యలో ఒకానొక ప్రకాశవంతమైన ఛాయపడుతూనే ఉంటుంది. అక్కడితో ఆగితే బావుండును. మళ్లీ ఈ నిషాదంతో ఓ పదేళ్ల తర్వాత మీ ముందుకొచ్చాను. ఈసారి ప్రతిస్పందన కొంత సానుకూలంగానే ఉన్నట్లనిపిస్తోంది. అంచేతే ఈ పురస్కారం దక్కింది. అదీ ఒకొనొక గొప్ప భావుకుడు, కళాకారుడు, నటుడు, నాటక రచయిత, ప్రయోక్త, దర్శకుడు, చిత్ర నిర్మాత, గాయకుడు, భక్తితత్పరుడు అన్నింటికీ మించి చాలచాల మంచి మనసున్న మంచి మనిషి, తన ఆనందాన్ని అందరికీ ఆహ్లాదంగా పంచి పెట్టే మనీషి, ఆషామాషీగానే కన్పించే మంచి రుషి భరణి, వెండితెర మీద ఆంధ్రదేశంలో ఊరూరా కన్పించే నక్షత్రం తనికెళ్ల భరణి నించి రావటం మీకే కాక నాకూ ఆశ్చర్యాన్ని కలిగించింది. చూడండి గమ్మత్తు! విషాదం నిండిన 'నిషాదం'కు పురస్కారం రావటం.

అదట్లా ఉంచి కొంచెం సీరియస్ విషయాల్లోకి వెళ్దామా మళ్లీ?
నా కవిత్వ శైలి రసవాద శైలి Hermitic
వ్యక్తీకరణ వినిర్మాణ విధానం Deconstructionistic
నా భావేవేశం అన్వేషణాత్మకం Search warrant
నా అంతరంగం అస్తిత్వవాదాత్మకం Existential
నా నిర్వచనం కవిత్వం భాష యొక్క భాష Matelinguistic
నా వాక్య నిర్మాణం ఉక్కిరి బిక్కిరి శ్వాస Syntactical breathlessness
నా కవితా వస్తువు ఏక ఘాతరేఖ కాదు Not linear

కాదు, కాదు, నేతి, నేతి సరే.. మరేదంటే
నా పదబంధాలలో పదాల స్థానాభాసం (Displacement) ఉంటుంది. దీనివల్ల ఎదురుచూడని (Unexpected) అలవాటు కాని (Nondescript) పదాల చేరిక (Collocation)ల వల్ల ఆశ్చర్యం కలుగుతుంది గాని ఒకానొక చేతనాచేతన (Subconscious) స్ఫూరిస్తుంది కాని పూర్తి భా వినిమంయ (Communication) జరుగదు.

ఒక రకంగా చెప్పాలంటే 'ఎవియో అర్థమ్ము కాని రక్తి స్ఫురించున'వే గాని 'భావగీతమ్ములు' మాత్రం కాదు. కవిత్వంలో నా వాస్తవికతకు మూలం అసంభవాత్మకత (Absurdity) సత్యం. నా వాచకం (Text)లో అనేక వాచకాలు (Subtext) ఉండటం, అనున్యూతక కలయిక (Montage) అనే శిల్పం ఉండటం, కథాంశాలు అవాస్తవిక గాథలు (Fabule) ఆధునిక వాస్తవవాదానికి జోడించడం వల్ల - నా కవిత్వంలో సంక్లిష్టత ఉంటుంది. ఆస్పష్టత వేరు, సంక్లిష్టత వేరు. రష్యన్ చలన చిత్ర దర్శకుడు సెర్డీ ఐజన్ట్సిన్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

"Any two pieces of film of any kind, placed together invetably combine into a new concept, a new quality arising out of the juxtaposition"

ఈ గత నలభై సంవత్సరాల నుండి విమర్శకులు నా కవిత్వంలో ఉన్న నలభై దుర్లక్షణాల గురించి చాలా వ్యాసాల్లో, ప్రసంగాల్లో ప్రస్తావించారు. కాలక్రమంలో వాటన్నిటికీ కాకపోయినా కొన్నిటికయినా వారు సర్దుబాటు చేసుకొన్నట్లనిపిస్తుంది.

కవిత్వంలో మంచి లక్షణాలేమిటో నా వ్యాససంకలనాలు 'కరచాలనం', 'నీడలు - జాడలు', 'వెన్నెల నీడలు' గ్రంథాల్లో విప్పి చెప్పటానకి కొంత ప్రయత్నించాను.

నా కవిత్వంలో రుషులెవరో చెప్పేస్తానివ్వాళ. జాన్ డన్, విలియం బ్లేక్, తామస్ హార్జీ, వాల్టర్ డిలమార్, హాప్కిన్స్, మలార్మే, బాదెలేర్, ఎలియట్‌లు. 1990 క్షీణ దశాబ్ది కవులు ఎర్నెస్ట్ డౌసన్, స్విన్ బర్న్‌లు కూడా నా గురువులే.

"మానవుడు చేసే ఒకే ఒక అకర్మక క్రియ కవిత్వం" అన్నాడు రాబర్ట్ లోవెల్.

పదాల సమాహారంలో అర్థాన్ని కాక ధ్వని (Suggestion)ని వినగలగాలి.

త్యాగానికీ సత్యానికీ, ప్రేమకీ సౌందర్యానికీ, సహాయానికీ సానుభూతికీ సాంఘిత చైతన్య స్ఫూర్తికీ నానాటికీ దూరం అవుతున్న సమకాలికతను రక్షించేదీ దగ్గర చేసేదీ కవిత్వం ఒక్కటే నేటికీ ఏనాటికీ. అలాంటి అనుకోని ఆవిష్కరణను సాధించే శక్తి (Serendipity) ఒక్క కవిత్వానికే ఉంది.

నిన్న రాత్రి ముంబైలో కొద్ది మంది మనుషులు వందలాది మంది మనుషుల్ని చంపడంలోని అమానుషత్వాన్ని ప్రశ్నించేది నిజమైన కవిత్వం.

కళల వల్ల, కవిత్వం వల్ల మనం సాధించేదేమిటి ఏమిటీ అంటే సృజన. సృజన వల్లనే అశాశ్వత్వాన్నించి తప్పించుకోగలం.

సృష్టి శాశ్వత్వం. ఈ అనంత విశ్వం శాశత్వం. మేరు పర్వతాలు, మహా సాగరాలు శాశ్వతం రోజూ సాయంత్రానికి రాలిపడిపోయే పూలూ శాశ్వతమే. ఒక్క మానవుడ మాత్రం అశాశ్వతం. మానవత్వమొక్కటే శాశ్వతం.

"Every one can achieve immortality to a smaller or greater degree of shorter or longer duration" అని మిలోన్ కుందేరా అభయహస్తం ఇస్తున్నాడు.

కళాకారులంతా అమరులే. కానీ కొందరు కళాకారులు కొద్దికాలం పాటు అమరులైతే, మహా కళావేత్తలు కొంచెం కొంచెం ఇంకంచెం ఎక్కువ కాలం అమరులవుతారన్న మాట. ప్లేటో, సోక్రటీస్, దాంతే, వర్జిల్, సోఫాక్లిస్, షేక్స్ఫియర్, టాల్‌స్టాయ్, దోస్తావ్ స్కీ, గెతే, మిల్టన్‌లు మన మన మానవ మేధకు అల్జీమర్స్ రానంత కాలం కొద్ది కాలమో, దీర్ఘకాలమో అమరులవుతారన్న మాట. మహా ప్రళయం వచ్చే వరకూ హిమవన్నగాలూ, హిందూ మహా సముద్రాలూ శాశ్వతం. చిత్రకళ, సంగీతం, శిల్పం, నాట్యం, భవన నిర్మాణం, సాగరాలపై సేతువులు, సముద్రంలో సొరంగ రైలు మార్గాలు, రోదసీలో సర్కస్ గిరికీలు, జంత్రం, యంత్రం గాత్రం హ్యూమన్ స్పిరిట్ ఉన్నంత వరకూ శాశ్వతాలు. మన శ్రీశ్రీ, మన కృష్ణశాస్త్రీ మనకు మరుపురానంత వరకూ శాశ్వతులు. కనుక కవిత్వమంటే అభిజ్ఞానం అన్నమాట.

English summary
Vegunta Mohan Prasad popularity known as 'Mo' is no more. he works will remain. As a tribute, here is his speech on his poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X