నగ్నమునికి తనికెళ్ల భరణి అవార్డు

నిస్వార్థంతో పనిచేసే అనేకమంది రాజకీయ నాయకులున్న కాలంలోనే నగ్నముని రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలను కళ్లకు కట్టినట్లు తన రచనల ద్వారా చూపించారని, ప్రస్తుత పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ 60, 70 దశకంలో సాహిత్య ప్రపంచంలో ఓ షాక్ ఇచ్చిన వ్యక్తి నగ్నముని అన్నారు.
నగ్నముని కొయ్యగుర్రం అనే దీర్ఘ కావ్యాన్ని రాశారు. విలోమ కథలు పేరు మీద అత్యవసర పరిస్థితిపై కథానికలు రాశారు. ఈ కథలు తెలుగు కథా సాహిత్యంలో కొత్త ఒరవడిని పెట్టాయి. దివిసీమ ఉప్పెనపై రాసిన కొయ్యగుర్రం తెలుగు సాహిత్యంలో విశేషమైన కావ్యంగా నిచించింది.
తూర్పు గాలి వచన కవితా సంపుటిని ఆయన వెలువరించారు. దిగంబర కవుల్లో ఆయన అగ్రశ్రేణి కవిగా నిలిచారు.












Click it and Unblock the Notifications