ఎన్నారై 'తొలి పూజ' కావ్యం

 NRI pens on Tirumala venkateswara swami
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని శిలావిగ్రహం తొలిసారి ఎవరు చూసారు?ఆ ఏడుకొండల వెంకన్నస్వామికి "తొలి పూజ" ఎవరు చేసారు? ఆ పూజ ఏ విధంగా చేసారు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా "తొలి పూజ" పుస్తకాన్ని రచించాడు ఓ ఎన్నారై యువకుడు. అతని పేరు తాడిమర్రి శ్రీనివాస రెడ్డి, అమెరికా లోని బోస్టన్ నివాసి. శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో ఈ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, శ్రీ డా.సి.నారాయణ రెడ్డి ఈ పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ - తొలి రచన లోనే ఇంత గొప్ప పదజాలం ప్రయోగించడం అధ్భుతమని అని అన్నారు. చక్కటి భక్తి భావాన్ని ఈ కావ్యంలో కనపరచారని రచయితను ప్రశంసించారు. వచన కవిత్వంతో, సరళమైన శైలితో, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ దివ్యకావ్యాన్ని రచించాచరని కొనియాడారు.

లాభాపేక్ష లేకుండా, ఈ పుస్తకం అందరికీ ఉచితంగా అందించాలని ఆకాంక్షిస్తూ, రచయిత అన్ని పబ్లిక్ లైబ్రరీలకు ఈ పుస్తకాన్ని ఉచింతంగా పంపిణీ చేసారు. ఇంటర్నెట్ లో కూడా, http://tolipooja.blogspot.com నుండి ఉచింతంగా డౌన్ లోడ్ చేసుకుని పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+