కథ రచనలో నవ్యత: జయధీర్

రచనల్లో భావుకత, నిబద్ధతలపై విశ్లేషిస్తూ పలు సూచనలు ఇచ్చారు. విమర్శకుడి వ్యక్తీకరణను రచయిత స్వాగతిస్తే అలాంటి రచనలు ఉత్తమరచనలుగా నిలుస్తాయన్నారు. రచనల్లో విమర్శస్థాయిని పెంచవలసిన అవసరాన్ని గుర్తించాలని, పాక్షిక విమర్శలకే తప్పా క్షేత్రస్థాయిలో విమర్శించే అవకాశం పత్రికలకు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
నేటి సాహిత్యంలో అస్థిరత్వమే తప్ప మహారచనలు కానరావడం లేదన్నారు. పత్రికలు వెబ్‌సైట్‌లో రచనలను పొందుపరచడం ద్వారా విమర్శకుడికి అవకాశం కలుగుతుందని అప్పుడే మెరుగైన భావుకతకు ఆస్కారం ఏర్పడుతుందని జయధీర్ అన్నారు.
ప్రముఖ సాహిత్యవేత్త ఆచార్య కుందుర్తి రజనీకాంత్ (బెంగళూరు) కూడా మాట్లాడారు. ఏ కథావస్తువుకైనా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం అవసరమన్నారు. ఎంచుకొనే రచనలు ఆదర్శంగా ఉండాలని ఉద్ఘాటించారు. కథానిలయం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు కాశీపట్నం రామారావు మాస్టారు మాట్లాడారు. సమష్టి కృషితో నేడు కథానిలయం సాహిత్యవేత్తల నిలయంగా మారిందని చెప్పారు.












Click it and Unblock the Notifications