కాత్యాయనికి సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత్రి, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు కేతవరపు కాత్యాయనీ విద్మహేకు 2013కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'సాహిత్య రంగంలో సగం' అనే వ్యాసాలకు సాహిత్య అకాడమీ అవార్డును బుధవారం కేంద్రం ప్రకటించింది. ఆమె కేతవరపు రామకోటి శాస్త్రీ కూతురు. కాత్యాయని స్త్రీ సాహిత్యరంగంపై ప్రసంగం పాఠాలు, పలు రచనలు చేశారు.
కాత్యాయనీ విద్మహే ముఖ్యంగా సాహితీ విమర్శకురాలు. రచయిత కాత్యాయని వివిధ ధృక్కోణాలలో మహిళల కోసం అనేక రచనలు చేశారు. వాటిలో స్త్రీలు ఉద్యమాలలో పాల్గొనే రచనలు కూడా ఉన్నాయి. మొత్తం ఆమె 28 వ్యాసాలు రాశారు.

సమాజాన్ని అర్ధం చేసుకోవడం, స్త్రీలు తమ సమస్యలను ఎదుర్కొవడం వంటి పలు అంశాలతో కూడిన రచనలు చేశారు. ఆ వివిధ భాషల్లో 22 మందికి కేంద్ర సాహితీ అవార్డులు కేంద్రం ప్రకటించింది.
తెలుగు కథానికపై, ముఖ్యంగా తెలంగాణ కథాసాహిత్యంపై ఆమె విశేషమైన వ్యాసాలు రాశారు. తెలంగాణ రాజకీయ ఉద్యమాల నేపథ్యంలో ఆమె తెలంగాణ సాహిత్యాన్ని విమర్శించే పనిచేశారు. సదస్సుల్లో ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆమెకు తెలుగులో ప్రథమశ్రేణి విమర్శకురాలిగా పేరుంది.


Click it and Unblock the Notifications