హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచయితల సభలోనూ హైదరాబాద్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రచయితల సభలోనూ హైదరాబాద్‌పై ఎవరికి హక్కు ఉంటుందనే విషయమే ప్రధానాంశంగా మారింది. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరాన్ని కేవలం ఒక ఆస్తిగా, రియల్ ఏస్టేట్ వ్యాపారంగా చూస్తున్నారే తప్పితే, దానిని తెలంగాణ అస్తిత్వతంగా చూడటం లేదని పలువురు తెలంగాణ మేధావులు, రచయితలు, నేతలు అభిప్రాయపడ్డారు. మంజీరా రచయితల సంఘం 27 వార్షికోత్సవం ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది.

వలసవాదులు, పెట్టుబడిదారులు హైదరాబాద్ స్వరూపాన్ని, స్వభావాన్ని నాశనం చేశారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ వనరులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. హుస్సెన్‌సాగర్ తీరాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు కబ్జా చేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అస్థిత్వానికి, ఆర్తికి మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 40 నుంచి 50 భిన్న సంస్కృతులు విరాజిల్లుతున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో హైదరాబాద్ నగరం ఒక్కటే అభివృద్ధి చెందిందని, కానీ సీమాంధ్రలో అనేక పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాయని ఆయన గుర్తు చేసారు. తెలంగాణకు ఉన్న ఒక్క నగరాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు దక్కనీయకూడదని సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. మూడు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అంతకుముందు ఏర్పడిన 11 రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సీనియర్ నాయకుడు టి హరీశ్‌రావు ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు తాను మోసం చేసుకుంటూ, సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హరగోపాల్ మాటలు...

హరగోపాల్ మాటలు...

అందర్ని కలుపుకొనిపోయే చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడిదారులు కేవలం ఒక ఆస్తిగా, రియల్ ఏస్టేట్ వ్యాపారంగానే చూస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆ ప్రశ్నే వద్దు: కె. శ్రీనివాస్

ఆ ప్రశ్నే వద్దు: కె. శ్రీనివాస్

హైదరాబాద్ నగరం ఎవరిదనే ప్రశ్న వేయకూడదని, ఆ అనుమానం కూడా అక్కరలేదని ప్రముఖ జర్నలిస్టు కె. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ గ్రామాలను కలుపుకుని హైదరాబాద్ విస్తరించిందని, హైదరాబాద్ చెత్తనంతా తెలంగాణ మోస్తోందని, అందువల్ల హైదరాబాద్ తెలంగాణకు చెందుతుందని ఆయన అన్నారు.

శాంతిభద్రతలు కూడా తెలంగాణకే..

శాంతిభద్రతలు కూడా తెలంగాణకే..

టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ శాంతి, భద్రతలను కేంద్రం చేతిలో పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

రామచంద్రమూర్తి కూడా..

రామచంద్రమూర్తి కూడా..

మంజీరా రచయితల వార్షికోత్సవ సభలో ప్రముఖ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఇలా కనిపించారు.

కె. శివారెడ్డి ఇలా...

కె. శివారెడ్డి ఇలా...

సీమాంధ్రకు చెందిన ప్రముఖ కవి కె. శివారెడ్డి మంజీరా రచయితల సంఘం వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. ఆయనకు మొదటి నుంచీ ఈ సంఘంతో అవినాభావ సంబంధం ఉంది.

దేశపతి శ్రీనివాస్ ఇలా..

దేశపతి శ్రీనివాస్ ఇలా..

ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సంఘం ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆయన ఇలా...

English summary
Hyderabad issue became focul point at Manjeera writers association anuual meeting held at Telugu university premises in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X