వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేరాకు అంతిమ వీడ్కోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావుకు సాహిత్య ప్రియులు అంతిమ వీడ్కోలు చెప్పారు. హైదరాబాదులోని హబ్సిగూడలోని హిందూ శ్మశాన వాటికలో చేరా భౌతిక కాయానికి ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన భౌతిక కాయాన్ని హబ్సిగూడ సీ్ట్రట్‌ నెంబర్‌-7లోని స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

చేరాను కడసారి చూసేందుకు కవులు, రచయితలు, విమర్శకులు, కళాకారులు, ప్రముఖులు తరలివచ్చారు. చేరా భౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చేరా మరణించిన సమయంలో ఆయన ఇద్దరు కుమారులు విజయసారథి, క్రిస్టఫర్‌, కూతురు సంధ్య అమెరికాలో ఉన్నారు. వారు శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఆదివారం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

మూడు రోజులుగా ఆసుపత్రి ఫ్రీజర్‌లో భద్రపరిచి ఉన్న చేరా మృతదేహాన్ని ఆదివారం ఉదయం హబ్సిగూడకు తీసుకురావడంతో భార్య రంగనాయకి, కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చేరా భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో కె. శివారెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, వరవరరావు, గద్దర్‌, జయరాజ్‌, వాసిరెడ్డి నవీన్‌, బిఎస్‌ రాములు, పిల్లి పద్మ, ఆశారాజు, డి.వెంకట్రామయ్య, శిఖామణి, కొండేపూడి నిర్మల, కంచె ఐలయ్య ఉన్నారు.

తెలంగాణ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఐ కార్యదర్శి నారాయణ, ప్రముఖులు రత్నమాల, పశ్యపద్మ, విమలక్క, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, టీడీపీ నాయకుడు బొబ్బల రమణారెడ్డి తదితరులున్నారు.

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరాకు అంతిమ వీడ్కోలు

ప్రముఖ సాహితీవేత్త, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు భౌతిక కాయానికి పలువురు సాహితీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరా భౌతిక కాయంపై పూలమాలలు ఉంచి పలువురు సాహితీ ప్రముఖులు కడపటి వీడ్కోలు చెప్పారు.

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరాకు అంతిమ వీడ్కోలు

చేకూరి రామారావు భౌతిక కాయానికి విప్లవ రచయిత వరవరరావు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పలువురు సాహితీవేత్తలు చేరాకు నివాళులు అర్పించారు.

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరాకు అంతిమ వీడ్కోలు

చేరా భౌతిక కాయాన్ని వాహనంపై యాత్రగా హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించారు.

English summary
Prominent literary personality and linguist Chekuri Rama Rao popularly known as Chera's dead body has cremated in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X