పైడి తెరేష్‌కు అంతిమ వీడ్కోలు (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీ వేత్త పైడి తెరేష్‌బాబుకు అభిమానులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. వివిధ రంగాల ప్రముఖులు బాధాతప్త హృదయాలతో నివాళులర్పించారు. తెరేష్‌బాబు కాలేయ వ్యాధితో సోమవారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద నివాళుర్పించారు. తెరేష్‌బాబుతో తమకున్న సాన్నిహిత్యాన్ని, సాహితీలోకానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పలువురు ప్రముఖులు తెరేష్‌ బాబు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

అనంతరం అశోక్‌నగర్‌ నుంచి పంజగుట్టలోని హిందూ శ్మశాన వాటిక వరకు సాగిన ఆయన అంతిమ యాత్రలో మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దళిత కవులకు చీకటి రోజు: డిప్యూటీ సిఎం

దళిత కవులకు చీకటి రోజు: డిప్యూటీ సిఎం

దళిత కవులకు ఇది చీకటి రోజని తెలం గాణ డిప్యూటీ సీఎం డాక్టర్‌ టి.రాజయ్య అన్నారు. అసమా నతలు రూపుమాపేందుకు తెరేష్‌బాబు ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన రాసిన అల్పపీడనం, హిందూ మహాసము ద్రం పుస్తకాలు అందరికీ ఆదర్శమన్నారు.

కుటుంబ సభ్యులకు రాజయ్య పరామర్శ

కుటుంబ సభ్యులకు రాజయ్య పరామర్శ

తెరేష్‌బాబు భౌతికకాయం వద్ద రాజయ్య నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కావడి కుండలని తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన ఆయన తనతో పాటు వందల మంది దళిత కవుల్ని ఉద్యమంలో మమేకం చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ నివాళి

డొక్కా మాణిక్యవరప్రసాద్ నివాళి

తెరేష్‌బాబు బహు ముఖ ప్రజ్ఞాశాలి డొక్కా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం నిరంతంర కృషి చేశారని చెప్పారు. తెరేష్ బాబు భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించారు.

జయధీర్ నివాళి

జయధీర్ నివాళి

గెలవాలని ఆరాటం, తపన ఉన్న వ్యక్తి పైడి తేరేష్‌బాబు అని ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు జయధీర్ తిరుమల రావు అన్నారు.

నారాయణమూర్తి నివాళి

నారాయణమూర్తి నివాళి

పైడి తెరేష్‌బాబు మృతి సాహితీ లోకానికి తీరని లోటని సినీనటుడు ఆర్‌. నారాయణ మూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన పాత్రను పోషించారన్నారు.

గద్దర్ నివాళి

గద్దర్ నివాళి

ప్రముఖ సాహితీవేత్త పైడి తెరేషథ్ బాబు భౌతిక కాయానికి ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్, తదితరులు నివాళులు అర్పించారు.

జూపాక సుభద్ర నివాళి

జూపాక సుభద్ర నివాళి

ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, కృపాకర్ మాదిగ తదితరులు పైడి తెరేష్ బాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+