వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగాచార్యకు ప్రముఖుల నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య (87) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం వంటి గొప్ప నవలలు ఆయన కలం నుంచి పుట్టినవే. వారం రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాశరథి సోమవారం తుదిశ్వాస విడిచారు.

రంగాచార్య అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నాం 12 గంటలకు రంగాచార్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు విరించి వెల్లడించారు.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్య సోదరుడే రంగాచార్య. 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి రంగాచార్య విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి జైలుకెళ్లారు.

ఆగస్టు24, 1928లో వరంగల్ జిల్లా చిన్నగూడూరులో రంగాచార్య జన్మించారు. 1944 నుండే తెలంగాణ సాయుధపోరాట చైతన్యంతో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1951-57 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1957 నుండి 1988 వరకు సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగబాధ్యతలను నిర్వర్తించారు. తుదిశ్వాస వరకు ఆయన రచనలు కొనసాగించారు.

దాశరథికి సన్మానం(ఫైల్)

దాశరథికి సన్మానం(ఫైల్)

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య (87) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

రంగాచార్య(ఫైల్)

రంగాచార్య(ఫైల్)

చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం వంటి గొప్ప నవలలు ఆయన కలం నుంచి పుట్టినవే.

దాశరథి దంపతులు(ఫైల్)

దాశరథి దంపతులు(ఫైల్)

వారం రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాశరథి సోమవారం తుదిశ్వాస విడిచారు.

దాశరథికి శంకర్రావు నివాళి

దాశరథికి శంకర్రావు నివాళి

రంగాచార్య అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

గద్దర్ నివాళి

గద్దర్ నివాళి

సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నాం 12 గంటలకు రంగాచార్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు విరించి వెల్లడించారు.

డిప్యూటీ సిఎం కడియం నివాళి

డిప్యూటీ సిఎం కడియం నివాళి

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్య సోదరుడే రంగాచార్య.

గద్దర్ కంటతడి

గద్దర్ కంటతడి

1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి రంగాచార్య విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి జైలుకెళ్లారు.

వరవరరావు నివాళి

వరవరరావు నివాళి

భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేశారు.

ఎంపి కేశవరావు నివాళి

ఎంపి కేశవరావు నివాళి

దాశరథి రంగాచార్య ఆత్మకథ తెలంగాణ ఆత్మకథగానే సాగింది. నిజాంకాలంలో జన్మించి సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో కన్నుమూశారు.

దాశరథి కుటుంబసభ్యులు

దాశరథి కుటుంబసభ్యులు

దాశరథి రంగాచార్య మృతికి గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వేర్వేరుగా సంతాపం ప్రకటించారు.

రసమయి నివాళి

రసమయి నివాళి

సికింద్రాబాద్, వెస్ట్‌మారేడుపల్లిలోని నివాసంలో దాశరథి భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

కవిత నివాళి

కవిత నివాళి

రంగాచార్యకు నివాళులర్పించిన నిజామాబాద్ ఎంపి కవిత.

దాశరథి రంగాచార్య

దాశరథి రంగాచార్య

సికింద్రాబాద్, వెస్ట్‌మారేడుపల్లిలోని నివాసంలో దాశరథి భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

దాశరథి రంగాచార్యకు భార్య కమలమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. అధ్యయనం-పోరాటం అనే నినాదానికి ఆయన అక్షరసాక్షి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యఆయన సహోదరులు.నుదుటపైన నామాలు ఉన్నా, హృదయంలో సుత్తీకొడవలి నా ఆదర్శం అంటూ ఆయన చాలా ఇంటర్వ్యూలలో తన నిశ్చితాభిప్రాయాలను ప్రకటించారు.

మోదుగుపూలు, జనపదం, అక్షరమందాకిని, అమృతంగమయ, బుద్ధజీవితసంగ్రహం, శబ్దశ్వాస, మాయజలతారు, రానున్నది ఏదినిజం, పావని, నల్లనాగు, అనువాదకథలు, మహాత్ముడు వంటి రచనలతో పాటు నాలుగు వేదాలను సరళమైన తెలుగులో వ్యాఖ్యాన సహితంగా రాశారు.

మహాభారతం, రామాయణం, మహాభాగవతాలను వచనంలో అందించారు జీవనయానం ఆయన ఆత్మకథ. చతుర్వేదసంహిత, అమృత ఉపనిషత్తు వంటి రచనలు ఆయనకు మంచిపేరు ప్రతిష్ఠలను తీసువచ్చాయి. దాశరధి రంగాచార్యుల రచించిన చిల్లర దేవుళ్లునవల సినిమాగా వచ్చింది. భారతీయ భాషలలోకి కూడా అనువాదం కావడమేగాక ఆయనకు కేంద్ర సాహ్యిత అకాడమీ పురస్కారం పొందింది.

భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేశారు. దాశరథి రంగాచార్య ఆత్మకథ తెలంగాణ ఆత్మకథగానే సాగింది. నిజాంకాలంలో జన్మించి సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో కన్నుమూశారు.

ప్రముఖుల సంతాపం

దాశరథి రంగాచార్య మృతికి గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వేర్వేరుగా సంతాపం ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు కె కేశవరావు, కవిత, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరుల సంతాపం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కేశవరావు, కవిత, ప్రజా గాయకుడు గద్దర్, తదితరులు దాశరథి రంగాచార్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

English summary
Telangana Deputy CM Kadiyam Srihari paid tribute to Dasarathi Rangacharya in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X