నేను
పొద్దున ఎనిమిది గంటలకి
గడియారంలో ముల్లునై
నీ చుట్టూ తిరుగుతాను
నాన్న ఒక్క ముద్ద తిను తిని అని
సాయంత్రం ఐదు గంటలకి
పెరడి కావలి తాతల
కట్టె పట్టుకు తిరుగుతాను
ఆడకుండా చదవండని
తొమ్మిదింటికి నిద్దరోయే వేళ
భూమి చుట్టూ సూర్యుడిలా
క్యూలూ కబుర్లతో తిరుగుతాను
గదిలోంచి నాయనమ్మ అరుస్తుంది అయాసంతో
రాను రాను పసిపాపలు వీళ్లా నీవా
తెలీకుండా పోతుందని
తనకేం తెలుసు, నేను పోగొట్టుకున్న బాల్యం
నా పిల్లల్లో వెదుక్కుంటున్నానని












Click it and Unblock the Notifications