లలితా ప్రసాద్ మినీ కవితలు

Mini poems by Lalitha Prasad
వెలుగు ఝరి

ఎవరు పిలిచారో
ఎవరి అనంతప్రేమో
పరవళ్లు తొక్కుతూ వెలుగు ఝరి
కొండలు, కోనల్లోంచి
మౌనసందేశ మరమరలతో..
పలకరిస్తోంది అనాదిగా
దోసిట్లోకి తీసుకుని ముద్దాడుదాం
ప్రశాంతత, సహనం అలవడుతుందేమో!

........

మనకోసమే అన్నీ!

అన్నీ మనకోసమే ...
నీటి అద్దం, మేఘాల గాలిపటం
చెట్ల నీడ, ఆకుల కంచం
అన్నీ మనకోసమే పుట్టాయి
మనమే వాటిని కాదంటున్నాం
ఇప్పటికైనా మేల్కోందాం
లేకుండా భవిష్యత్తరాలు క్షమించవు.

.......

ఎక్సాడస్‌

ఒకదానితో ఒకటి
ఒక్కొక్కటీ... వేనకు వేలై
తరలిపోతున్నాయి ఉండనీయడం లేదని!
మూకుమ్మడిగా రెక్కలు విదిలించుకుని
తిరిగిరావు ఇక ఈ దారంట!
ఎటు వెళ్లినా క్షమిస్తాయి మన ద్రోహాన్ని!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+