మూడు లోకాల బాధ

చావు అంచుల వరకి వెళ్లి వచ్చి
నాకోసం ఎదురుచూస్తున్నారనుకుంటూ చావుతో పోరాడి
ఆఖరి క్షణం వరకూ ఊపిరి వదలకుండా పోటిపడి వచ్చి చూస్తే
ఆఖరికి మిగిలింది నా అమ్మ నాన్నలు,అన్నావదినలు -
ఎవ్వరూ కనపడలేదు ఇక మరి ; ఎవ్వరూ ఈ ఎడారిలాంటి సముద్రంలో -
నా ప్రేయసి కానీ నా మిత్రులు కానీ - నన్ను విడిచి పెట్టి వాళ్ళు వాళ్ల గమ్యంలో -
కళ్ళు తెరిచి చూస్తే నన్ను నేన్ను గుర్తుపట్ట లేనట్టుగా నా తల పైన ముప్పై ఎనిమిది కుట్లు-
ఒక శిల్పి చెక్కినట్టు అతి దారుణంగా అలంకరించబడింది నా ముఖ చిత్రం ;నన్ను నేను గుర్తు పట్టడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాలు .
ప్రేమ - శారీరిక పరిచయమే కాకుండా ఒక విశాలమయిన ఆత్మ పరిశీలనలాంటి ఒక అనుభవంలా మారినప్పుడు ఎదుటి వాళ్లలోకి ఎంత హాయిగా వెళ్ళగలుగుతావు - ఎంత ఆపదలో వున్నా వెన్ను తిరగకుండా ఎంత ధైర్యంగా వెళ్ళగలుగుతావు -
నేను పడిన బాధ ; ఈ నా మూడు సంవత్సరాల మూడు లోకాల బాధ -
ఇదొక సందిగ్ధ సీమ - ఇదొక దారి లేని దారి ; పాదముద్రలు తప్ప పాదాలు కనిపించని దారి ; పాదాలకు దారిని నేర్పించిన వాళ్ళని గుర్హ్తుకు చేసుకునే సందర్భం ఇది - ఏ శిల్పి చెక్కిన శిల్పం ఇది?
వస్తున్నాను
అందుకే మీ వద్దకి తిరిగి - ఒకప్పుడు మీరు పాలు తాపించి పెంచిన అక్షరాలతో - ఇలా -
- సాహిర్ భారతి












Click it and Unblock the Notifications