• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వానలుపడ్డా మా చెరువు కడుపు నిండదు

By Pratap
|

ఆకాశం నేలమీద పడి మొత్తుకొని మొత్తుకొని చిల్లులుపడ్డ గుండేఐ
విలపించి విలపించి భోరున కురిసింది
కాలంకాని కాలంల ఆకాశంనుండి తుఫానై సరాసరి నేలదిగిన గంగమ్మ
మొలకెత్తుతున్న మొక్కల్ను
చిగురిస్తున్న చెట్లను
చేతికొచ్చిన పంటను కసిదీరా ముంచి వాగై వరదై కాలువై జలనాట్యమాడింది

రైతులు తడిసిన వొంటిని బట్టలిప్పుకున్నట్టు ఇప్పుకొని వాగోర్రినట్టు మొత్తుకుంటున్నరు
కూలీలు కాల్లుచేతులిరిగినట్టు నీళ్లమధ్యన బొండిగెలదాకా మునిగి కూలబడ్డరు
గరీబోళ్ల గుడిసెల్ని హటావో అన్నంత కసిగా వాడలల్ల పారుతున్నది వాననది
బడిపిల్లల్ని పొద్దున్నే మోసుకుపోయిన కిక్కిరిసిన బస్సు
తెగిన రోడ్డుమీది కాలువల కాయితప్పడవూగినట్టు ఊగుతున్నది
గేట్లు తెరిసిన డ్యాం నీళ్ళల్లపడి కొట్టుకుపోయినట్టు
కోళ్లు కుక్కలు పిల్లులు పందులు మంచాలు కుర్చీలు కూలర్లు బట్టలు చెప్పులు పుస్తకాలు కొట్టుకుపోతున్నయ్ -
జనాలు తడిసిన చెట్లలెక్క పారుతున్ననీళ్లల్ల నిలబడి వణుకుతున్నరు
పోలీసులు అప్రమత్తమై జనాలమధ్య పోటెత్తిన నీళ్ళల్ల అలల్లెక్క ఊగుతున్నరు
పేపరోల్లు ప్రమాదాన్ని పక్కనపెట్టి హడావిడిగా ఒక్కొక్క ఫోటోను అపురూపంగా దోసిట పడుతున్నరు
రాజకీయనాయకులు గొడుగులకింద నిలబడి
శత్రుదేశమేదో నీటిదాడి చేసినట్టు అర్ధంకాని చూపులతో తలలూపుతున్నరు
దూరంగా నిలబడ్డ మంత్రులను చూసిన జనాలు
కసికొద్దీ దోసిళ్ళనిండా మురికినీటిని తీసుకొని జలతర్పణ చేస్తున్నరు

Anwar's poem Vaanalu Padda Maa Cheruvu Kadupu nindadu

---
నాల్గు రోజుల తెర్పివ్వని వానకు నగరం అతలాకుతలం కాలేదు
పట్టాణాభివ్రుద్ది సంస్థలు ప్లానింగులు పక్కనపెట్టి
మున్సిపాలిటీలు అడ్డమైన పర్మిషన్ లిచ్చి
కార్పోరేటర్లు గజానికింత దోపిడిచేసి
మురికి కాల్వల మీద బంగళాలు లేసినా సూడలేదు
చెరువులను కబ్జాచేసినా వూకున్నరు
వూకున్న పాపం ఊర్లను నగరాన్ని ముంచింది
---
ఒక్కవానకే అంతోఇంతో చెరువు నిండినా
ఎమ్మెల్యే ఏసిన చెరువుకట్ట తెగి చెరువుల నీళ్లు చేన్లల్ల ఇండ్లల్ల సొర్రి దొరికిన దారిలపడి పారిపోయినయ్
నాలుగు చినుకులకే అధికారపార్టీ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఏసిన రోడ్డంతా బొందలు పడ్డది
ఈ అవస్థ మాకు వాన చేసింది కాదు
మా నాయకులు చేసిన రాజకీయ అవస్థ

Anwar's poem Vaanalu Padda Maa Cheruvu Kadupu nindadu

---
ఎన్ని వానలు పడ్డా కాకతీయులు తొవ్విన పాఖాల చెరువు గుండె పగలలేదు
నిజాము కట్టిన హుస్సేన్సాగరు కూలబడలేదు
ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ చెరువులు తొవ్విండ్లు
కుతితీర వానలుపడ్డా
వాననీటితో నిండిన చెరువులు గండ్లుపడి
చెరువు పొట్టపలిగి నీళ్లు బయటపడ్డయ్

- అన్వర్

English summary
A prominent poet Anwar has responded to the recent rains in Telangana is his poem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X