ఈ ఫొటోపై ఎన్నో అనుమానాలు?
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నారు. బారీ బుచ్ విల్మోర్, నిక్ హేగ్, డాన్ పెరిట్‌తో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యోమగాములందరూ శాంటాక్లాజ్ టోపీలను ధరించారు. వారి పక్కనే క్రిస్మస్ ట్రీ కనిపించింది.
శాంటా టోపీలు ఎలా..
ఇది- పలు సందేహాలకు తెర తీసినట్టయింది. అంతరిక్షానికి శాంటా క్లాజ్ టోపీలు ఎలా వెళ్లాయనే ప్రశ్న తలెత్తుతోంది. క్రిస్మస్ ట్రీ సైతం అక్కడ కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్లు భూమ్మీది నుంచి వెళ్లేటప్పుడే వాటిని తమ వెంట తీసుకెళ్లి ఉండొచ్చనే ప్రశ్నే తలెత్తదు.

10 రోజుల కోసం..
ఎందుకంటే- సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోతామనే విషయం ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు తెలియదు. ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్‌ను ఐఎస్ఎస్‌కు పంపించింది నాసా. అది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే.
చిక్కుకుపోయిన సునీత..
ఐఎస్ఎస్‌లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సివచ్చింది.
ముందే తీసుకెళ్లారా?
సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకుని రాగలమని నాసా ఇదివరకే ప్రకటించింది. శాంటా క్లాజ్ టోపీలు, క్రిస్మస్ ట్రీని అంతకంటే ముందే ఐఎస్ఎస్‌కు చేరవేసి ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. అలాంటి ప్రకటన నాసా గతంలో ఎప్పుడూ చేయలేదు కూడా.
నెటిజన్ల ప్రశ్నలు..
సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములు క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనికి వస్తోన్న రిప్లైలు.. ఆయా ప్రశ్నలను రేకెత్తిస్తోన్నాయి. ఐఎస్ఎస్‌లో కాకుండా నాసా స్టూడియోలో గానీ ఉన్నారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తోన్నారు నెటిజన్లు.
బోయింగ్ ఇష్యూస్..
ఈ ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్యల తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి. దీనితో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలో దిగింది బోయింగ్. ఆ పనులు కొనసాగుతున్నాయి.
To everyone on Earth, Merry Christmas from our @NASA_Astronauts aboard the International @Space_Station. pic.twitter.com/GoOZjXJYLP
— NASA (@NASA) December 23, 2024
ఫిబ్రవరిలో..
ఈ నేపథ్యంలో- ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత విలయమ్స్, విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకోనుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామని నాసా వెల్లడించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications