Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇస్రో.. మొదలెట్టేసింది!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్00- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. ఈ ఏడాది చివరి నాటికి కార్యరూపం దాల్చబోతోంది. వచ్చే డిసెంబర్ లో గగన్ యాన్ టెస్ట్ మిషన్ చేపట్టనుంది ఇస్రో.

ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ వెల్లడించారు. యాక్జియం 4 గ్రూప్ కేప్టెన్ శుభాంషు శుక్లాతో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పదేళ్లలో కాలంలో అంతరిక్ష రంగం సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.

Big milestone India s Historic Gaganyaan as ISRO completes 1st Integrated Air Drop Test

దశాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 300కు పైగా చేరిందని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష రంగంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నాయని నారాయణన్ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సబ్‌ఆర్బిటల్ మిషన్లను ప్రైవేట్ సంస్థలు విజయవంతంగా పూర్తి చేశాయని తెలిపారు.

ఈ క్రమంలో గగన్ యాన్ మిషన్ లో మరో ముందడుగు వేసింది ఇస్రో. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ కోసం రూపొందించిన పారాచూట్ ఆధారిత డీసెల్లరేషన్ సిస్టమ్ పనితీరును నిర్ధారించే తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్-డ్రాప్ టెస్ట్ (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది.

ఈ పరీక్షకు భారత వైమానిక దళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయాన్ని తీసుకుంది. ఇస్రో, డీఆర్‌డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పారాచూట్ డీసెల్లరేషన్ వ్యవస్థను పరీక్షించేందుకు, భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్‌లో ఐదు టన్నుల బరువున్న డమ్మీ పేలోడ్ ను తీసుకెళ్లారు.

నిర్దేశిత ఎత్తుకు చేరుకున్న తర్వాత, సముద్రంపై క్యాప్సూల్‌ను డ్రాప్ చేశారు. నిర్దేశించిన ప్రదేశంలో ఈ డమ్మీ క్యాప్సుల్ దిగింది. దీనితో ఈ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. ఈ తెల్లవారుజామున ఈ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. గగన్‌యాన్ లో ఇదొక మైలురాయి.

ఈ పరీక్ష ద్వారా వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి రూపొందించిన పారాచూట్ వ్యవస్థ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించినట్టయింది. అంతరిక్షంలోకి మనుషులను పంపించిన తరువాత వాళ్లు.. మళ్లీ భూమికి రావడానికి ఈ మాడ్యుల్ ఉపయోగపడుతుంది.

మాడ్యూల్‌ను తిరిగి భూమికి చేరేటప్పుడు దాని వేగాన్ని తగ్గించడం అనేది ఇందులో అత్యంత కీలకం. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో భూమికి చేరుకుంటోన్న సమయంలో ఈ మాడ్యుల్ ను స్థిరీకరించడానికి ఉపయోగపడే అన్ని పారాచూట్‌ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో.

ఇందులో ప్రారంభ వేగాన్ని తగ్గించడానికి రెండు డ్రోగ్ పారాచూట్లను వినియోగించింది. నిజానికి గత ఏడాది మేలోనే ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ను ఇస్రో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ- కొన్ని సాంకేతిక కారణాలతో దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. హెలికాప్టర్‌లో కొన్ని సమస్యలు ఉన్నందున అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేసింది.

వాటన్నింటినీ పరిష్కరించి.. తాజాగా టెస్టులను నిర్వహించింది. దీనికి సంబంధించిన డేటా విశ్లేషణ పూర్తయిన వెంటనే గగన్ యాన్ పై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలనే రూపొందించుకుంటామని ఇస్రో వర్గాలు తెలియజేశాయి. ఇది విజయవంతం కావడంతో గగన్ యాన్ మిషన్ కు రెడ్ కార్పెట్ వేసినట్టయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+