Lunar Eclipse 2025: ఆకాశంలో అద్భుతం.. 82 నిమిషాల పాటు రక్త చంద్రుడు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభమైంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణంగా, ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ లోని ప్రజలు పాక్షిక గ్రహణాన్ని వీక్షించారు. చంద్రుడు దాదాపు 82 నిమిషాలపాటు భూమి నీడలోకి పూర్తిగా వెళ్లిపోయాడు.
ఇక భారత్ లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు చంద్ర గ్రహణం మొదలు అయింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1.26 గంటలకు ముగిసింది. భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ పైకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అందువల్ల చంద్రుడు కనిపించడు. ఈ దృశ్యం చాలా అరుదుగా సంభవిస్తుందని పండితులు, ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం లేకుండా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ధ్యానం, జపం లాంటివి చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇక గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేసుకోవాలని, వస్తువులపై పవిత్ర నదీ జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయాలని అలాగే తల స్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే పేద ప్రజలకు దుస్తులు, పాలు, ఆహారం, బియ్యం దాణం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications