China Technology: చైనా వాడి టెక్నాలజీ వేరే లెవెల్..సెకనుకు కి.మీ దూసుకుపోడమే..!!
Fastest journey: ప్రపంచ కర్మాగారంగా పేరొందిన పొరుగు దేశం చైనా టెక్నాలజీలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని ఎన్నో సాంకేతిక వండర్స్‌ను ఆవిష్కరించింది. తాజాగా ఆ దేశానికి చెందిన ఓ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విమానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణాల కోసం వెచ్చించే సమయం చాలా తగ్గిపోతుందని భావిస్తున్నారు.
చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే ఏరోస్పేస్ సంస్థ ప్రయాణీకుల కోసం యున్‌సింగ్ విమానం ప్రోటోటైప్ ను తయారు చేసింది. దీని మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. వచ్చే నవంబరులో ఇంజిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పింది. ఇది మాక్ 4 వేగంతో ప్రయాణించగలదని పేర్కొంది. 1976 నుంచి 2003 వరకు అందుబాటులో ఉన్న సూపర్ సోనిక్ ప్యాసెంజర్ ప్లేన్ కాంకర్డ్ గరిష్ఠ వేగానికి రెండింతల కంటే ఎక్కువ కావడం విశేషం.

5 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ కొత్త విమానం లండన్ నుంచి న్యూయార్క్‌కు కేవలం 1.5 గంటల్లో చేరుకోగలదని భావిస్తున్నారు. ట్రాన్స్అట్లాంటిక్ మార్గంలో అతివేగంతో ప్రయాణించడానికి కాంకర్డ్ 2 గంటలు 53 నిమిషాలు తీసుకోగా.. సాధారణ విమానాలకు సుమారు 8 గంటల సమయం పడుతుంది. స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మాత్రమే కాకుండా అనేక ఇతర సంస్థలు కూడా కమర్షియల్ సూపర్ సోనిక్ విమానయానాన్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 2027లో ప్రయాణికుల కోసం పూర్తిస్థాయి సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని ప్రారంభించే అవకాశముందని వెల్లడించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2003లో కాంకర్డ్ చివరి ప్రయాణం తర్వాత సుమారు 25 ఏళ్ల అనంతరం ప్రయాణికులను తీసుకెళ్లబోయే మొదటి సూపర్ సోనిక్ ఎయిర్‌లైనర్‌గా అవతరించనుంది.
అమెరికా కేంద్రంగా ఉన్న వీనస్ ఏరోస్పేస్ ప్రస్తుతం మాక్ 6 వేగాన్ని సాధించగల సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. దీనితో హైపర్సోనిక్ ఎకానమీ సాధ్యమయ్యేలా చేస్తామని పేర్కొంది. స్పేస్ ఎక్స్ మరియు టెస్లా CEO ఎలాన్ మస్క్ కూడా సుపర్సోనిక్ జెట్ పై ఆసక్తి కనబరిచారు, కానీ అదనపు పనిభారం కారణంగా ప్రస్తుతానికి దానిపై పని చేయడం లేదు.












Click it and Unblock the Notifications