గగన్ యాన్ పై వీడిన సస్పెన్స్..!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్00- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. ఈ ఏడాది చివరి నాటికి కార్యరూపం దాల్చబోతోంది. వచ్చే డిసెంబర్ లో గగన్ యాన్ టెస్ట్ మిషన్ చేపట్టనుంది ఇస్రో.

ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ వెల్లడించారు. యాక్జియం 4 గ్రూప్ కేప్టెన్ శుభాంషు శుక్లాతో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పదేళ్లలో కాలంలో అంతరిక్ష రంగం సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.

India s Historic Gaganyaan Test Mission Launch is Just Around the Corner

దశాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 300కు పైగా చేరిందని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష రంగంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నాయని నారాయణన్ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సబ్‌ఆర్బిటల్ మిషన్లను ప్రైవేట్ సంస్థలు విజయవంతంగా పూర్తి చేశాయని తెలిపారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం ఈ రంగంలో మరింత వేగంగా ముందుకు వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేకంగా సౌత్ ఏషియన్ శాటిలైట్'ను నిర్మించి, ప్రయోగించినట్లు వివరించారు.

జీ20 దేశాల కోసం 'జీ20 శాటిలైట్'ను కూడా రూపొందించామని, ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు సహాయపడుతుందని నారాయణన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కూడా మోదీ నాయకత్వంలోనే సాకారమైందని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని కీలక ప్రయోగాలను చేపట్టబోతోన్నామని, గగన్ యాన్ కూడా ఇందులో ఉందని అన్నారు.

ఇటీవలి యాక్సియం-4 మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, తన అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షయానంలో తన పాత్ర, ప్రయాణించిన వాహనం, అక్కడ నిర్వహించిన ప్రయోగాలకు సంంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ మిషన్‌కు తాను పైలట్ గా వ్యవహరించినట్లు శుక్లా తెలిపారు. క్రూ డ్రాగన్‌లో నాలుగు సీట్లు ఉంటాయని, అందులో తాను మిషన్ పైలట్‌గా వ్యవహరించానని వివరించారు. కమాండర్‌తో కలిసి పని చేయడం, క్రూ డ్రాగన్ సిస్టమ్స్‌తో సంభాషించడం తన ప్రధాన విధులుగా పేర్కొన్నారు.

మానవ సహిత అంతరిక్ష యానం శిక్షణతో మాత్రమే ముగిసిపోదని, అంతకు మించి అపారమైన జ్ఞానాన్ని అందిస్తుందని శుక్లా అన్నారు. గగన్‌యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతరిక్షంలో గడిపే అనుభవం భూమి మీద నేర్చుకునేదానికి చాలా భిన్నంగా ఉంటుందని వివరించారు.

అంతరిక్షంలో ఉన్నప్పుడు శరీరం అనేక మార్పులకు లోనవుతుందని, 20 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత, గురుత్వాకర్షణలో ఎలా జీవించాలో మరచిపోతామని వ్యాఖ్యానించారు. ఈ అనుభవాలు భవిష్యత్తులో భారతీయ వ్యోమగాముల శిక్షణ, అంతరిక్ష యానానికి సంబంధించిన ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. త్వరలోనే భారత సొంత క్యాప్స్యూల్, సొంత రాకెట్ సహకారంతో అంతరిక్షంలోకి ప్రవేశిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+