ముందు వాడుకోండి.. నచ్చితేనే కొనుక్కోండి.. "లావా" అదిరిపోయే ఆఫర్ !!

స్మార్ట్‌ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. కాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో స్వదేశీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది "లావా". ప్రస్తుతం తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ "లావా అగ్ని 4" ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంలో కంపెనీ భారతీయ మార్కెట్‌లో తొలిసారి వినూత్నమైన ప్రయత్నం చేస్తూ.. అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది.

వినియోగదారులు ఫోన్‌ను లాంచ్‌కు ముందే ఇంట్లోనే పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది. లావా ఈ ప్రచార కార్యక్రమానికి "డెమో@హోమ్" అని పేరు పెట్టింది. ఇది ప్రస్తుతం భారత్‌లో ఏ ఇతర బ్రాండ్ అమలు చేయని ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీగా చూడవచ్చు. లావా బృందం స్వయంగా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల ఇంటి వద్ద డెమో కోసం అందిస్తుంది. ఫోన్ యొక్క డిజైన్, కెమెరా, పనితీరు, డిస్‌ప్లే క్వాలిటీ, UI అనుభవం-అన్నింటినీ వినియోగదారు చేతబట్టి పరీక్షించుకునే వీలు ఉంటుంది. నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు అని.. కొనాలని ఎలాంటి బలవంతం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

lava-agni-4-price-specifications-and-demo-at-home-details

కాగా నవంబర్ 20 నుంచి 24 వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు మాత్రమే పరిమితం. ముందుగా నమోదు చేసుకున్న వారిలో కొంత మందిని ఎంపిక చేసి, వారికి హోమ్ డెమో అందిస్తారు. ఈ విధానం భారతీయ వినియోగదారులకు "బై చేయడానికి ముందు ట్రై" అనుభవాన్ని ఇవ్వడం ద్వారా లావా బ్రాండ్‌పై నమ్మకం పెంచడమే లక్ష్యంగా భావిస్తున్నారు.

లావా అగ్ని 4 ఫీచర్లు..

డిస్‌ప్లే..

6.67-అంగుళాల AMOLED స్క్రీన్

1.5K రిజల్యూషన్

120Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్, వీడియోలలో సూపర్ స్మూత్ అనుభవం

హై బ్రైట్‌నెస్‌తో అవుట్‌డోర్‌లో కూడా క్లియర్ విజిబిలిటీ

పనితీరు..

MediaTek Dimensity 8350 ప్రాసెసర్

హై-పర్ఫార్మెన్స్, పవర్-ఎఫిషియెంట్ చిప్‌సెట్

గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ల్యాగ్‌లెస్ అనుభవానికి అనువైనది

మెమరీ & స్టోరేజ్..

LPDDR5X RAM - వేగవంతమైన యాప్ స్విచింగ్

UFS 4.0 స్టోరేజ్ - లోడ్ టైమ్‌లు చాలా తగ్గుతాయి

ఫైళ్ల ట్రాన్స్‌ఫర్ స్పీడ్ బాగా పెరుగుతుంది

కెమెరా..

50MP ప్రైమరీ సెన్సర్

8MP అల్ట్రా వైడ్ - ల్యాండ్‌స్కేప్ షాట్స్‌కు బెటర్

సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా - ఈ సిగ్మెంట్‌లో అరుదైన స్పెసిఫికేషన్

నైట్ ఫోటోగ్రఫీకి ప్రత్యేక AI ఆప్టిమైజేషన్

కనెక్టివిటీ..

Wi-Fi 6E - వేగం, స్టేబిలిటీ రెండూ మెరుగ్గా

USB 3.2 పోర్ట్ - డేటా ట్రాన్స్‌ఫర్ వేగం USB 2.0 కంటే అనేక రెట్లు ఎక్కువ

5G మల్టీ-బ్యాండ్ సపోర్ట్

బ్యాటరీ & ఛార్జింగ్..

5000mAh పెద్ద బ్యాటరీ

66W ఫాస్ట్ ఛార్జింగ్ - కొన్ని నిమిషాల ఛార్జ్‌లోనే గంటల పాటు ఉపయోగించవచ్చు

థర్మల్ మేనేజ్‌మెంట్ మెరుగ్గా ఉండే అవకాశం

లాంచ్ తేదీ & అంచనా ధర..

లావా అగ్ని 4 అధికారిక లాంచ్: నవంబర్ 20

అంచనా ధర: ₹30,000 వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+