అల్టిమేట్ స్కై షో: ఎల్లుండే.. టెలిస్కోప్ అవసరం లేకుండానే

ఖగోళ ప్రేమికులకు నవంబర్ మొదటి వారంలో అద్భుతమైన సెలెస్టియల్ ఈవెంట్ కనువిందు చేయబోతోంది. ఆకాశంలో చందమామతో పాటు సౌరకుటుంబంలోని రెండు గ్రహాలు ఒకే సరళరేఖపైకి రానున్నాయి. దీన్ని తిలకించడానికి ఎలాంటి ఖరీదైన పరికరాలు గానీ టెలిస్కోప్‌ గానీ అవసరం లేదు. నేరుగా ఈ ఖగోళ దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు ఈ ప్లానెటరీ పరేడ్ ఆవిష్కృతం కానుంది.

ప్లానెటరీ అలైన్మెంట్

నవంబర్ 2 నుంచి ఈ ప్లానెటరీ అలైన్మెంట్ ఏర్పడుతుంది. చంద్రుడు, జూపిటర్, మార్స్ ఒకే ప్రాంతంలో అతి దగ్గరగా దర్శనం ఇవ్వనున్నాయి. దాదాపుగా ఒకే సరళరేఖపైకి చేరుకుంటాయి. సోమవారం వేకువజామున ఆకాశంలో తూర్పు- ఆగ్నేయ దిశలో చంద్రుడు- అంగారకుడు- బృహస్పతి కాంతిమంతంగా వెలిగిపోతూ కనిపిస్తాయి. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఈ ప్లానెటరీ పరేడ్ కనువిందు చేయనుంది.

Moon Mars and Jupiter Alignment on Nov 2 See the Spectacular Ultimate Morning Sky Trio Best View

ఆకాశంలో తూర్పు- ఆగ్నేయ దిశలో

ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని చూడటానికి సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవాల్సి ఉంటుంది. వేకువజామున.. అంటే చీకటిగా ఉన్న సమయంలో ఆరుబయటకు వచ్చి ఆకాశంలో తూర్పు- ఆగ్నేయ దిశలో ఈ పరేడ్ ను కళ్లారా వీక్షించవచ్చు. ఆకాశంలో కాంతిమంతంగా వెలిగిపోయే చంద్రుడిని ఓ గైడ్ గా ఎంచుకుంటే మిగిలిన రెండు గ్రహాలను గుర్తించడం చాలా సులభమౌతుంది. సౌరమండలంలోనే అతిపెద్ద గ్రహమైన గురుడు తన స్వయంప్రకాశంతో వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తాడు. దానికి అతి సమీపంలోనే జెయింట్ రెడ్ ప్లానెట్ అంగారకుడు తన ఎరుపు, నారింజ రంగు వెలుగుతో ప్రత్యేకంగా దర్శనం ఇస్తాడు.

విశ్వం పుట్టుక రహస్యాల వేట: మార్స్ చందమామ 'ఫోబోస్'పై జపాన్ స్పేస్ క్రాఫ్ట్
విశ్వం పుట్టుక రహస్యాల వేట: మార్స్ చందమామ 'ఫోబోస్'పై జపాన్ స్పేస్ క్రాఫ్ట్

వరుసగా మూడు రోజుల పాటు

సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఆకాశంలో ఒకే మార్గంలో ప్రయాణిస్తూ అలరిస్తాయి.. ఈ మూడు కూడా. ప్రతి రోజూ రాత్రి వేళ చంద్రుడు ఉదయించే సమయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవడం, రోజురోజుకూ చందమామ స్థానం ఈ రెండు గ్రహాల మధ్య మారుతున్నట్లుగా అనిపిస్తుంది. సోమవారం నాడు చంద్రుడు ఆకాశంలో అత్యంత ఎత్తులో కనిపిస్తూ క్రమంగా అంగారక గ్రహానికి చేరువ అవుతుంటాడు. మంగళవారం వేకువజాము నాటికి చంద్రుడు మరింత కిందికి వచ్చి గురు గ్రహానికి దిగువ భాగంలో నిలుస్తాడు. ఈ ప్లానెటరీ అలైన్మెంట్ స్కే గేజర్లకు ఓ అద్భుత అనుభూతిని పంచతుంది.

చంద్రుడు కూడా బతికిపోయాడు గానీ..
చంద్రుడు కూడా బతికిపోయాడు గానీ..

సాధారణ రోజుల్లో

సాధారణ రోజుల్లో గ్రహాలను చూడటానికి శక్తిమంతమైన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో గురుడు, అంగారకుడు.. చంద్రుడికి సమీపంలో నిలవడం వల్ల సాధారణ కంటికే ఎంతో ప్రస్పూటంగా గోచరిస్తాయి. ఓ సాధారణ బైనాక్యులర్ ను ఉపయోగిస్తే గురు గ్రహం చుట్టూ ఉండే ఇతర ఉపగ్రహాలు, అంగారకుడి నారింజ వర్ణాన్ని మరింత అందంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

పెళ్లిళ్ల సీజన్ వేళ.. పసిడి ధర పాతాళానికి
పెళ్లిళ్ల సీజన్ వేళ.. పసిడి ధర పాతాళానికి

సాధారణ కంటికి స్పష్టంగా కనిపించే అవకాశాలు

నవంబర్ ప్రారంభంలో తెల్లవారుజాము వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కాస్త చల్లగా ఉండే అవకాశం ఉంది. నగరాల్లో వీధిదీపాల వెలుగులు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించడానికి అడ్డంకిగా మారొచ్చు. అందుకే చీకటిగా, నిర్మలంగా ఉండే ప్రదేశాలు గానీ, ఎత్తైన భవనాల పైకప్పులను ఎంచుకోవడం వల్ల గ్రహాలను ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా చూడవచ్చు. గ్రహాలు, చంద్రుడు ఇలా ఒకే ప్రాంతంలోకి రావడం నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ, సాధారణ కంటికి స్పష్టంగా కనిపించే అవకాశాలు అరుదుగా లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+