బాక్సాఫీస్ వద్ద తొలి ఏఐ సినిమా డిజాస్టర్!.. భారతీయ చిత్ర పరిశ్రమకు బిగ్ అలర్ట్!!

సినిమా ఇండస్ట్రీలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వేగంగా విస్తరిస్తోంది. అయితే చైనాలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైన తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. చైనాలోని థియేటర్లలో విడుదలైన తొలి పూర్తి ఏఐ ఆధారిత ఫీచర్ ఫిల్మ్‌గా ప్రచారంలోకి వచ్చిన 'సాన్‌క్సింగ్‌దుయ్: ఫ్యూచర్ పాస్ట్' అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దాదాపు 10 మిలియన్ యువాన్ల(సుమారు 1.5 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా.. తొలి రోజున 10 వేలకు పైగా స్క్రీనింగ్స్ సాధించినప్పటికీ మొదటి వారంలో కేవలం 198,000 డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. వాణిజ్యపరంగా విఫలమైనప్పటికీ.. ఈ ప్రాజెక్టును ఓ ముఖ్యమైన ప్రయోగంగానే చిత్ర నిర్మాతలు అభివర్ణించారు.

'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

సాధారణ సాంప్రదాయ పద్ధతిలో తెరకెక్కించే చిత్రాలతో పోలిస్తే ఈ ఏఐ చిత్రం నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం సరిపోలేదని వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ పరాజయం వల్ల ఏఐ సినిమాల భవిష్యత్తు పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. చైనాలో ఇప్పటికే ఆన్‌లైన్ షార్ట్ ఫిలిం నిర్మాణంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడి నివేదికల ప్రకారం దాదాపు 95 శాతం మైక్రో డ్రామాలు ప్రస్తుతం ఏఐ ద్వారానే రూపొందుతున్నాయి. మరోవైపు అమెరికా కూడా డిసెంబర్ 4న 'గాడ్స్ డోంట్ గివ్ గిఫ్ట్స్' అనే ఆర్-రేటెడ్ సైన్స్ ఫ్రిక్షన్ ఆంథాలజీని పరిమిత థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది. యూట్యూబర్ గాసిప్ గాబ్లిన్ రూపొందించిన ఈ సినిమా అమెరికాలో విడుదల కానున్న తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రచారం పొందుతోంది.

China First AI Feature Film Flops at Box Office A Warning for Indian Cinema and Global Filmmakers
ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ లు.. నువ్ మామూలోడివి కాదన్నా..!
ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ లు.. నువ్ మామూలోడివి కాదన్నా..!

చైనాలో తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్ ఎదుర్కొన్న ఈ ఘోర పరాజయం భారతీయ సినిమా ఇండస్ట్రీకి కూడా ఓ హెచ్చరికగా మారే అవకాశం ఉంది. మన దేశంలో కూడా ఫిల్మ్ మేకింగ్, కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ వినియోగాన్ని పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడం, కొన్ని పనులు వేగంగా జరగడం నిజమే అయినప్పటికీ.. అది బలమైన కథనం, నటీనటుల సహజ నటన, భావోద్వేగాలను పండించేందుకు ప్రత్యామ్నాయం కాలేదని నిరూపించబడింది. ఖర్చును తగ్గించుకునేందుకు లేదా కొత్త ఫార్మాట్లలో ప్రయోగాలు చేయడానికి భారతీయ దర్శకులు ఏఐ వైపు మొగ్గు చూపవచ్చు. కానీ కేవలం సాంకేతికంగా మెరిసిపోతూ, హ్యూమన్ టచ్ లేని సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం కష్టమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+