Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7,200mAh బ్యాటరీతో "Vivo Y51 Pro 5G".. ధర ఎంతంటే ??

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ తన వై-సిరీస్‌లో భాగంగా Vivo Y51 Pro 5G అనే హ్యాండ్‌సెట్‌ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఆధునిక ఫీచర్లు, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkartతో పాటు వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో, రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో మార్కెట్‌లోకి వస్తోంది.

ధరలు & ఆఫర్లు..

Vivo Y51 Pro 5G రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే బేస్ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. అలాగే 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ప్రారంభ ఆఫర్‌గా మార్చి 16కు ముందు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ రూ.2,500 వరకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

prominent-chinese-brand-vivo-y51-pro-5g-price-and-specifications-full-details-also-availability-off

Vivo Y51 Pro 5G ఫీచర్స్..

డిస్ప్లే..

Vivo Y51 Pro 5Gలో 6.75 అంగుళాల పెద్ద LCD డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 83 శాతం NTSC కలర్ కవరేజ్ ఉండటంతో వీడియోలు, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్..

ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6 పై పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ యూజర్లకు స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు పలు కస్టమైజేషన్ ఫీచర్లను అందిస్తుంది.

ప్రాసెసర్ & పనితీరు..

ఈ ఫోన్‌లో 4nm టెక్నాలజీపై పనిచేసే ఆక్టా-కోర్ మీడియాటెక్ 7360 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది వేగవంతమైన పనితీరు అందించడంతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు.

RAM & స్టోరేజ్..

Vivo Y51 Pro 5Gలో 8GB LPDDR4x RAM అందించారు. స్టోరేజ్ పరంగా 128GB మరియు 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి, డేటా ట్రాన్స్‌ఫర్ కూడా త్వరగా జరుగుతుంది.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/2.0 అపర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధానంగా ఉంటుంది. అదనంగా f/2.4 అపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ కెమెరా ద్వారా మంచి క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవచ్చు. అలానే ఈ స్మార్ట్‌ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. అందువల్ల హై క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయడం సాధ్యమవుతుంది.

బ్యాటరీ..

ఈ ఫోన్‌లో భారీ 7,200mAh బ్యాటరీను అమర్చారు. దీని వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించవచ్చు. బ్యాటరీను త్వరగా ఛార్జ్ చేయడానికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. తక్కువ సమయంలోనే ఫోన్ బ్యాటరీను పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్ & బిల్డ్..

ఈ హ్యాండ్‌సెట్ కాంపోజిట్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌తో రూపొందించబడింది. అదనంగా డస్ట్ మరియు వాటర్ రక్షణ కోసం IP68 మరియు IP69 రేటింగ్‌లను కూడా కలిగి ఉంది.

కలర్ ఆప్షన్స్..

ఈ ఫోన్ ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+