Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SpaceX: చంద్రుడిపై మనుషుల నగరం? మస్క్ కొత్త మాస్టర్ ప్లాన్

మనుషుల్ని ముందుగా చంద్రుడిపై స్థిరపడేలా చేయాలన్న ప్లాన్‌తో ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు. అంగారకుడిపై నగరం అన్న ఆయన డ్రీమ్ ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్లింది. దానికి బదులు - చంద్రుడిపై స్వయం అభివృద్ధి చెందే నగరం... అదే స్పేస్‌ఎక్స్ కొత్త ఫోకస్!

ఫిబ్రవరి 9, 2026న ఎక్స్ (X) వేదికగా స్పందించిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్, స్పేస్‌ఎక్స్ (SpaceX) తన ప్రాధాన్యతను అంగారకుడి నుంచి చంద్రుడిపైకి మార్చిందని స్పష్టం చేశారు. చంద్రుడిపై నగరం నిర్మించడం వేగంగా, వాస్తవికంగా సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

SpaceX

"స్పేస్‌ఎక్స్ ఇప్పటికే చంద్రుడిపై స్వయం అభివృద్ధి చెందే నగరాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టింది. ఇది పదేళ్లలోపు సాధ్యమవుతుంది. కానీ అంగారకుడికి వెళ్లాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుంది" అని మస్క్ తెలిపారు. నాగరికత భవిష్యత్తుకు ఇదే సరైన మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రయాణమే ఆరు నెలలు

దీనికి కారణం కూడా చెప్పారు. చంద్రుడికి వెళ్లడం చాలా ఈజీ. ప్రతి పది రోజులకు ఒకసారి, రెండు రోజుల ప్రయాణంతో నౌకను పంపవచ్చు. కానీ అంగారకుడికి వెళ్లాలంటే గ్రహాల అమరికపై ఆధారపడి సుమారు 26 నెలలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. పైగా ప్రయాణమే ఆరు నెలలు పడుతుంది. అందుకే చంద్రుడు వేగవంతమైన పురోగతికి సరైన ఎంపికగా మస్క్ భావిస్తున్నారు.

అయితే, దీన్నిబట్టి అంగారక మిషన్లు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయనుకోవద్దని మస్క్ స్పష్టం చేశారు. స్పేస్‌ఎక్స్ అంగారకుడిపై కూడా నగరం నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని, ఐదు నుంచి ఏడేళ్లలోపు అక్కడ ఆవాసం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంటే చంద్రుడు ఫస్ట్, అంగారకుడు నెక్స్ట్ అన్నమాట.

SpaceX ఫోకస్ అదే..

గతంలో 2026 చివరి నాటికి అంగారకుడికి మానవరహిత మిషన్ పంపుతామని మస్క్ చెప్పినా, తాజా ప్రణాళికలు మాత్రం చంద్ర అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనం తర్వాత, పెట్టుబడిదారులకు స్పేస్‌ఎక్స్ చంద్ర మిషన్లకే ఫోకస్ పెడుతోందని చెప్పడంతో ఈ స్పష్టత ఇచ్చారు.

నివేదికల ప్రకారం, మార్చి 2027 నాటికి చంద్రుడిపై మానవరహిత ల్యాండింగ్ చేయాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ పనిచేస్తోంది. ఇది కంపెనీకి కీలక మైలురాయిగా మారనుంది. ఇదే సమయంలో చంద్రుడిపై వ్యోమగాములను పంపడంలో అమెరికా-చైనా మధ్య పోటీ కూడా తీవ్రమవుతోంది.

వాషింగ్టన్, బీజింగ్..

1972లో చివరిసారిగా అపోలో మిషన్ ద్వారా అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు వాషింగ్టన్, బీజింగ్ రెండూ చంద్రుడిని భవిష్యత్ అంతరిక్ష ఆధిపత్యానికి కీలకంగా భావిస్తూ తమ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేస్తున్నాయి.

మానవత్వాన్ని "బహుళ-గ్రహ జాతి"గా మార్చాలన్న ఎలాన్ మస్క్ విజన్‌లో ఇది మరో కీలక మలుపు. అంగారకుడి కన్నా ముందుగా చంద్రుడిపై మనిషి స్థిరపడితేనే దీర్ఘకాలిక మనుగడ సాధ్యమని మస్క్ నమ్మకం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే - మనుషుల తొలి స్పేస్ సిటీ ఎక్కడ? చంద్రుడిపైనా... లేక గుర గ్రహంపైనా?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+