Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్‌ నెలలో లాంఛ్ కాబోతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. అక్టోబర్ నెలలో వన్‌ప్లస్, వివో, నథింగ్ ఇంక్., ఒప్పో, రియల్‌మీ వంటి ప్రముఖ సంస్థలు తమ కొత్త మోడళ్లను — X300, Find X9 సిరీస్, Phone (3a) Lite, Realme 15 ప్రో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ లాంచ్ చేయగా.. ఇప్పుడు నవంబర్‌లో టెక్ ప్రపంచం మరింత ఉత్సాహంగా మారనుంది.

పలు కంపెనీలు తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను ఈ నెలాఖరులో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. నవంబర్ నెల భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి అత్యంత హాట్‌గా మారనుంది. వన్‌ప్లస్, ఒప్పో, వివో, iQOO వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు.. దేశీయ బ్రాండ్ లావా అన్ని వర్గాల వినియోగదారుల కోసం శక్తివంతమైన, ఫీచర్ రిచ్ ఫోన్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

upcoming-smartphone-releases-in-india-november-2025

వన్‌ప్లస్ 15..

వన్‌ప్లస్ కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ OnePlus 15 ఫోన్‌ను నవంబర్ 13న విడుదల చేయనుంది.ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, ఇన్-స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

ప్రధాన ఫీచర్లు:

  • Qualcomm Snapdragon 8 Elite Gen 5 ఆక్టా-కోర్ CPU

  • 12GB/16GB LPDDR5X RAM, 256GB/512GB స్టోరేజ్

  • Android 16 ఆధారిత ColorOS 16

  • వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా

  • 7,300mAh బ్యాటరీ, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్

    ఈ ఫోన్‌లో IP68 రేటింగ్ ఉన్న వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, Dolby Atmos ఆడియో, Wi-Fi 7 మరియు Bluetooth 5.4 వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

    వన్‌ప్లస్ 15R..

    వన్‌ప్లస్ 15R, చైనాలో ఇప్పటికే లభ్యమవుతున్న Ace 6 సిరీస్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్.ఇది 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

    ప్రధాన వివరాలు:

    • Snapdragon 8 Elite చిప్‌సెట్, Adreno 830 GPU

    • Android 16 ఆధారిత ColorOS 16

    • 12GB/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్

    • 7,800mAh బ్యాటరీ, 120W వైర్డ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్

      కెమెరా సెటప్:50MP ప్రధాన కెమెరా (OISతో) + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 16MP ఫ్రంట్ కెమెరా.4K వీడియో రికార్డింగ్, HDR10+ సపోర్ట్, మరియు Dolby Vision ఫీచర్‌లు దీని హైలైట్స్.

      Oppo Find X9 & X9 Pro..

      Find X9 సిరీస్ రెండు వేరియంట్లలో వస్తుంది — Find X9 మరియు X9 Pro.రెండు మోడళ్లలో MediaTek Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది.

      🔹 Find X9

      • 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

      • 3nm Dimensity 9500 చిప్‌సెట్

      • 12GB/16GB RAM, 256GB/512GB స్టోరేజ్

      • 7,025mAh బ్యాటరీ, 80W SuperVOOC, 50W AirVOOC ఛార్జింగ్

        కెమెరాలు: 50MP ప్రధాన (Sony LYT808), 50MP అల్ట్రా-వైడ్, 50MP 3x టెలిఫోటో, 2MP మల్టీ-స్పెక్ట్రల్ లెన్స్ (Hasselblad Portrait).

        🔹 Find X9 Pro

        • 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే, 1–120Hz రిఫ్రెష్ రేట్

        • 7,500mAh బ్యాటరీ, 80W SuperVOOC

        • 50MP (Sony LYT828) + 50MP అల్ట్రా-వైడ్ + 200MP 3x పెరిస్కోప్ (Samsung HP5)

        • ముందు 50MP సెల్ఫీ కెమెరా

        • Dolby Vision 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్

          iQOO 15..

          iQOO తన తాజా ఫ్లాగ్‌షిప్ iQOO 15 ను నవంబర్ 16న విడుదల చేయనుంది. ఇది 6.85 అంగుళాల 2K+ AMOLED స్క్రీన్, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

          స్పెసిఫికేషన్లు:

          • Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్

          • Android 16 ఆధారిత OriginOS 6.0

          • 12GB/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్

          • 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ + 40W వైర్‌లెస్ ఛార్జింగ్

            కెమెరా సెటప్:50MP (Sony IMX921), 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో.32MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్. iQOO 15లో ప్రత్యేక Cooling Chamber టెక్నాలజీ, 4D గేమింగ్ వైబ్రేషన్ సిస్టమ్, AI Game Frame Booster కూడా ఉన్నాయి.

            Vivo X300 & X300 Pro..

            Vivo X300 సిరీస్ రెండు వేరియంట్లలో వస్తుంది. X300, X300 Pro పేరుతో లాంఛ్ కాబోతున్నాయి.

            Vivo X300..

            • 6.31 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

            • Dimensity 9500 చిప్‌సెట్

            • 12GB/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్

            • 6,040mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్

            • 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

              కెమెరాలు: 200MP (Samsung HPB, OISతో), 50MP అల్ట్రా-వైడ్ (JN1), 50MP ZEISS APO పెరిస్కోప్ టెలిఫోటో (LYT602).ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

              Vivo X300 Pro..

              • 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే

              • Zeiss T* కోటింగ్, V3+ ఇమేజింగ్ చిప్

              • 7,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్

              • IP68 రేటింగ్, Dolby Vision వీడియో సపోర్ట్

                Lava Agni 4 సిరీస్..

                లావా కంపెనీ తన Agni 4 సిరీస్ ఫోన్లను నవంబర్ 20న భారతదేశంలో విడుదల చేయనుంది.ఇది మిడ్-రేంజ్ సిగ్మెంట్‌లో ఒక శక్తివంతమైన ఎంపికగా నిలవనుంది.

                ప్రధాన ఫీచర్లు:

                • 6.78 అంగుళాల Full HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

                • MediaTek Dimensity 8350 చిప్‌సెట్

                • Android 16 OS

                • 8GB/12GB RAM, 7,000mAh బ్యాటరీ

                • Dual Camera సెటప్ (64MP ప్రైమరీ + 8MP అల్ట్రా వైడ్), 16MP ఫ్రంట్ కెమెరా

                  అదనంగా: Agni 4లో AI కెమెరా మోడ్, 5G కనెక్టివిటీ, Dolby Atmos ఆడియో, మరియు IP54 రేటింగ్ ఉన్న బాడీ ఉండనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+