X Chatతో ఎలాన్ ఎంట్రీ: WhatsApp కన్నా బెటర్ ఫీచర్స్

X Chat: అపర కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. గతంలో టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం xAIని పునర్వ్యవస్థీకరించారు. దీని పరిధిని మరింత విస్తృతం చేశారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. ఇది- టాప్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సప్ (WhatsApp) గుత్తాధిపత్యానికి సవాల్ విసిరేది.

వాట్సప్ కు పోటీగా 'ఎక్స్ చాట్' (X Chat)ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా దీన్ని లాంచ్ చేశారు. ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫామ్.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. X చాట్.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్. అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఇందులో ఉంటాయి. అలాగే పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్‌ల కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉండటం దీని ప్రత్యేకత.

X Chat The Ultimate Competitor to WhatsApp

ఎలన్ మస్క్ స్వయంగా ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం విడుదలను ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఆడియో/వీడియో కాల్స్, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌తో కూడిన సరికొత్త కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. Xను "ఎవ్రీథింగ్ యాప్"గా మార్చే ఉద్దేశంతో త్వరలో 'ఎక్స్ మనీ (X Money) కూడా ప్రారంభమవుతుందని మస్క్ పేర్కొన్నారు. ఎక్స్ చాట్ లో పంపిన మెసేజీలు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని తెలిపారు. వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని వివరించారు.

కొత్త మెసేజింగ్ యాప్ లో యూజర్లు తాము మెసేజ్ లను పంపిన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేయవచ్చు, లేదా డిలెట్ చేయవచ్చు. అవసరం అనుకుంటే డిజప్పియర్ చేసే వెసలుబాటు కూడా ఉంది. వాట్సాప్‌లో పంపిన ఏదైనా సమాచారాన్ని డిలెట్ చేస్తే.. This Message was Deleted.. అని కనిపిస్తుంది. ఎక్స్ ఛాట్ లో డిలెట్ చేస్తే.. ఇది కనిపించదు.

ఫలానా మెసేజీ తమకు అందినట్లు కూడా తెలియదు. పూర్తిగా అదృశ్యం అవుతాయి. వాట్సాప్ మాదిరిగానే నిర్దిష్ట సమయం తర్వాత చాట్‌లు ఆటోమేటిక్‌గా డిలెట్ అయ్యే టైమర్‌ ఇందులో ఉంది. ఈ X చాట్ యాప్.. ప్రస్తుతానికి iOS, వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. X సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ DM విభాగం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+