IND Vs PAK: రికార్డు సృష్టించిన భారత్, పాక్ మ్యాచ్.. హాట్ స్టార్‍లో 3 కోట్ల మంది చూశారట..!
భారత్, పాక్ మ్యాచ్ అంటే అటు పాకిస్థాన్ తో పాటు, ఇటు భారత అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని కొలంబోలో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ ను భారీగా చూస్తున్నారు. ఈ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ ఫాంలో రికార్డు సృష్టించింది. హాట్ స్టార్ భారత్ పాక్ మ్యాచ్ ను దాదాపు 3 కోట్లు మంది చూశారు. ఇది ఆల్ టైం రికార్డుగా హాట్ స్టార్ చెబుతోంది. గతంలో కూడా ఇండియా పాక్ మ్యాచ్ ను హాట్ స్టార్ కోట్లలో వ్యూస్ వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ను కోటి 80 లక్షల మంది చూడగా.. ఇప్పుడు అది డబుల్ అయింది. మూడు కోట్ల మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చ్సుతున్నారు. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఉచితంగా చూడడానికి అవకాశం కల్పించడంతో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 56 పరుగులు చేయగా.. శుభ్ మన్ గిల్ 10 ఫోర్లతో 58 పరుగలు చేశాడు.

ఇక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కోహ్లీ హాఫ్ సెంచరీ వరకు మెల్లగా ఆడిన కోహ్లీ తర్వాత స్పీడ్ పెంచాడు. ఈ క్రమంలో వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ తర్వాత సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 111 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
ఇక పాకిస్థాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది ఒక్కో వికెట్ తీశారు. షాహీన్ అఫ్రిది 10 ఓవర్లలో 79 పరుగులు ఇవ్వగా.. నసీమ్ షా 9.2 ఓవర్లలో 53, ఫాహిమ్ అష్రాప్ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకున్నాడు. హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయలేదు. నిన్న 5 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. షాదాబ్ ఖాన్ 10 ఓవర్లలో 71 పరుగులు ఇవ్వగా.. ఇఫ్తికర్ అహ్మద్ 5.4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు.












Click it and Unblock the Notifications