Shoaib Malik: షోయబ్ మాలిక్ కు బ్యాడ్ టైమ్- ఫిక్సింగ్ తో కాంట్రాక్ట్ రద్దు !
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు ఓ రేంజ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో అన్ని ఫార్మాట్లలోనూ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ కు తాజాగా సానియా మీర్జాతో విడాకుల వ్యవహారం చికాకు పెడుతూనే ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుకుందామని భావించిన మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతని కాంట్రాక్ట్ రద్దు చేస్తూ లీగ్ ఫ్రాంచైజ్ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్... ఫార్చూన్ బరిషల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే తాజాగా ఫార్చ్యూన్ బరిషల్ జట్టుతో కలిసి మూడు మ్యాచ్‌లు ఆడిన మాలిక్ వ్యక్తిగత కారణాలు చూపుతూ దుబాయ్‌కి తిరిగి వచ్చాడు. దీంతో మాలిక్ పై ఫిక్సింగ్ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఫార్చూన్ బరిషల్ జట్టు మాలిక్ కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్ , ఖుల్నా రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. బరిషల్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పవర్‌ప్లేలో షోయబ్ మాలిక్‌ను బౌలర్‌గా తీసుకురావాలని నిర్ణయించాడు. అయితే బౌలింగ్ కు దిగిన మాలిక్.. తన కెప్టెన్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే కాదు ఆశ్చర్యకరంగా ఆ ఓవర్‌లో మూడు నో బాల్‌లు వేసి 18 పరుగులు ఇచ్చాడు. మాలిక్ వేసిన ఈ ఓవర్ తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
అదే సమయంలో తాజాగా పాకిస్తాన్ నటి సనా జావెద్ తో మూడో పెళ్లి చేసుకున్న మాలిక్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు మాలిక్ చెత్త బౌలింగ్, బీపీఎల్ లో అనుమాస్పదంగా వేసిన నో బాల్స్ పైనా ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానూర్ రెహమాన్ మాలిక్ పై ఫిక్సింగ్ అనుమానంతో అతనితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో బీపీఎల్ లో మాలిక్ తిరిగి ఆడే అవకాశం లేకుండా పోయింది.
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
బాబూ.. నీ బౌలింగ్ కో దండం..! బుమ్రాకు నో చెప్పేసిన యువీ..! -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications