ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్‌ను ముంచేది వీళ్లేనా?

పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉంది. టీ20 ప్రపంచ కప్ 2026లో సెమీఫైనల్‌కు చేరలేకపోవడం, ఆపై బంగ్లాజేష్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం పాలవ్వడంపై అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలపై పాక్ వెటరన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని బోర్డు ఆటగాళ్ల ముందు మోకరిల్లుతోందని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పీసీబీ తీరును ఎండగట్టాడు.

ఆ 6-8 మందే పాక్ క్రికెట్‌ను శాసిస్తున్నారు..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గత ఐదు నుంచి ఏడేళ్లుగా కేవలం 6-8 మంది ఆటగాళ్లను మాత్రమే బ్రాండ్‌లుగా ప్రచారం చేస్తోందని షెహజాద్ విమర్శించాడు. "వీరే పీఎస్ఎల్ ఫేస్, వీరే పాకిస్థాన్ టీమ్ ఫేస్ అని మీరు నమ్మబలికారు. వీరు పాకిస్థాన్ తలరాతను మారుస్తారా? వీరికి స్పాన్సర్‌షిప్‌లు ఇచ్చారు, కెప్టెన్సీలు కట్టబెట్టారు. మొత్తం జట్టును ఆ కొద్దిమంది ఆటగాళ్లకు, వారి ఏజెంట్లకు అప్పగించారు" అని అహ్మద్ షెహజాద్ మండిపడ్డాడు.

Ahmed Shehzad Blasts Mohsin Naqvi PCB Says Board Kneeling Before 6-8 Players Full Details

పార్టీలు చేసుకున్నారు.. జేబులు నింపుకున్నారు..!
జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారని అహ్మద్ షెహజాద్ ఆరోపించాడు. "ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు, పార్టీలు చేసుకున్నారు, తమ జేబులు నింపుకున్నారు.. కానీ పాకిస్థాన్‌కు ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయారు. పైగా ఓటమికి బాధ్యత వహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పటికీ బ్లేమ్ గేమ్ (ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం) ఆడుతున్నారు తప్ప.. వారి ఇగో మాత్రం తగ్గడం లేదు" అని షెహజాద్ దుయ్యబట్టాడు.

బలహీనమైన బోర్డు: అహ్మద్ షెహజాద్ ఘాటు విమర్శలు
మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ప్రస్తుత పీసీబీని తాను చూసిన అత్యంత బలహీనమైన బోర్డుగా అహ్మద్ షెహజాద్ అభివర్ణించాడు. "బోర్డు దగ్గర అధికారం ఉంది, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆటగాళ్ల ముందు మోకరిల్లుతోంది. ప్రతి టోర్నీ తర్వాత ఏదో ఒక కొత్త ట్రిక్ ప్లే చేయడం బోర్డుకు అలవాటుగా మారింది తప్ప, సమర్థులైన కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం లేదు." అని అహ్మద్ షెహజాద్ విమర్శించాడు. పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, కేవలం కొందరు ఆటగాళ్ల చుట్టూనే బోర్డు తిరుగుతోందని షెహజాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పాక్ క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోర్డు తన పంథాను మార్చుకోకపోతే పాక్ క్రికెట్ మరింత పతనమవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+