Asia Cup 2025: పహల్గాంను గుర్తుచేసిన పాక్ ఓపెనర్ ఫీట్..! చిక్కుల్లో బీసీసీఐ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి. పహల్గాం దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేంద్రంపై ఎంత ఒత్తిడి పెంచిందో ఆపరేషన్ సింధూర్ చూస్తేనే అర్దమవుతుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తో ప్రపంచంలో ఎక్కడా ఆడకూడదని నిర్ణయించిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని ద్వైపాక్షిక టోర్నీలకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో ఆసియాకప్ లో ప్రస్తుతం పాకిస్తాన్ తో భారత్ ఆడాల్సి వస్తోంది.
ఆసియాకప్ లో పాకిస్తాన్ తో లీగ్ మ్యాచ్ ఆడే విషయంలోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం ఇబ్బందులు ఎదురవుతాయనే సాకుతో బీసీసీఐ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు లీగ్ మ్యాచ్ తో పాటు సూపర్ 4లోనూ పాకిస్తాన్ తో ఆడిన భారత్ రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. దీంతో ఊపిరిపీల్చుకుంటున్న బీసీసీఐ తాజాగా మరో విషయంలో చిక్కుల్లో పడింది.

शाबाश मोदी जी!
— Supriya Shrinate (@SupriyaShrinate) September 21, 2025
बस, यही देखना बाक़ी था
इसीलिए खिलवा रहे हैं क्रिकेट?
इसकी हिम्मत कैसे हुई यह करने की?
नरेंद्र मोदी एक कमज़ोर प्रधानमंत्री हैं pic.twitter.com/Ms2KF7U308
నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనే ఇందుకు కారణం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ శుభారంభం అందించాడు. తోటి బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా పట్టుదలగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా ఏకే 47 గన్ తరహాలోనే బ్యాట్ ను చేతులతో పట్టుకుని ఓ ఫోజ్ కూడా ఇచ్చాడు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.

Sahibzada Farhan just proved on the field how Pakistani terrorists slaughtered 26 innocents in Pahalgam—gunning them down like it was nothing.
— Sanjay Raut (@rautsanjay61) September 21, 2025
Reached his fifty and gripped the bat like an AK-47, firing boundaries!
This spit in the face of BCCI & Modi govt is peak humiliation.… pic.twitter.com/ojOxocKJfU
పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఫర్హాన్ ఇచ్చిన ఏకే 47 ఫోజ్ తో ఇప్పుడు బీసీసీఐ విమర్శల పాలవుతోంది. అసలు భారత జట్టును ఎందుకు పాకిస్తాన్ తో ఆడేందుకు పంపారు, అక్కడ ఇలాంటి అవమానాలు మనకు అవసరమా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో బీసీసీఐ తప్పు చేసిందని, కేంద్రం కూడా తప్పుచేసిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే కేంద్రం, బీసీసీఐ వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు.












Click it and Unblock the Notifications