Viral Video: ఆసియాకప్పు తీసుకోని స్కై..! పీసీబీ ఛీఫ్ తో షేక్ హ్యాండ్ వైరల్..!
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పీసీబీ ఛీఫ్, పాకిస్తాన్ మంత్రి కూడా అయిన మొహసిన్ నక్వీ నుంచి ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మారిన పరిస్దితుల్లో దాయాది దేశానికి చెందిన నక్వీ నుంచి ట్రోఫీ అందుకుని 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేకే మనోళ్లు ఇలా చేశారన్న చర్చ జరుగుతోంది.
దీంతో ఈ టోర్నీ నిర్వాహక దేశంగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నక్వీ ఆసియా కప్ ట్రోఫీని గ్రౌండ్ నుంచి హోటల్ కు తీసుకెళ్లిపోయి అనంతరం బీసీసీఐ అధికారులకు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో క్రికెట్ నిబంధనల ప్రకారం నక్వీ నుంచి ఈ ట్రోఫీ అందుకునేదుకు సూర్య సహా ఇతర భారత క్రికెటర్లు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇంత పట్టుదలగా ఉన్న వాళ్లు ఈ టోర్నీ ప్రారంభ సమయంలో మాత్రం అదే నక్వీతో షేక్ హ్యాండ్స్ ఇస్తున్న వీడియో బయటికి వచ్చింది.

Team India T20I captain, Surya Kumar Yadav shaking hands with Pakistan Cricket Board Chairman Mohsin Naqvi. pic.twitter.com/sjaPunG4xP
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) September 16, 2025
దీంతో ఫైనల్ తర్వాత గెలిచిన ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ ఛైర్మన్ నక్వీ నుంచి అందుకునేందుకు నిరాకరించిన వారు టోర్నీ ఆరంభంలో ఆయనకు షేక్ హ్యాండ్స్ ఎలా ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. దీంతో కొత్త వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ షేక్ హ్యాండ్ కూ, టోర్నీ గెలుపుకూ మధ్య ఏదో జరిగిందన్న వాదన తెరపైకి వస్తోంది. భారత్ లోని విపక్ష పార్టీలు దీనిపై బీజేపీతో పాటు బీసీసీఐని నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

Just 15 days ago, at the start of the series, they were shaking hands and smiling for photos with Pakistan’s minister Mohsin Naqvi.
— Sanjay Raut (@rautsanjay61) September 29, 2025
And now? Full-on nationalist drama for the cameras!
If patriotism was truly in your blood, you wouldn’t have even stepped on the field with… pic.twitter.com/jX81sfdMx2
బీజేపీ ఆదేశాలతోనే ఇలా భారత క్రికెటర్లు ఇలా నక్వీ నుంచి ఆసియాకప్ ట్రోఫీని తీసుకోలేదని, టోర్నీ ఆరంభంలో మాత్రం నక్వీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్లు, తొలి మ్యాచ్ లో పాక్ క్రికెటర్లకు మాత్రం అదే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, చివరికి ట్రోఫీ కూడా తీసుకోకపోవడం చూస్తుంటే వీరి వెనుక బీజేపీ, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టోర్నీకి వెళ్లడమే కరెక్ట్ కాదని తాము ముందే చెప్పామని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి.
-
పాకిస్థాన్ లో చిక్కుకున్న IAF పైలట్..? భారత్ సంచలన ఆపరేషన్..! -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!











Click it and Unblock the Notifications