భార్యతో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తా..! సీనియర్ స్టార్ కు షాకిచ్చిన బీసీసీఐ..!
ఛాంపియన్స్ ట్రోఫీని బీసీసీఐ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో తెలియజేసే ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. తాజాగా విదేశాల్లో వరుస సిరీస్ ఓటముల తర్వాత బీసీసీఐ క్రికెటర్లను కట్టడి చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అంతే కాదు వెంటనే వాటిని అమల్లో పెట్టేసింది. దీంతో తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో జట్టులోని ఓ సీనియర్ క్రికెటర్ కు భారీ షాక్ తగిలింది. తన కోసం నిబంధనల్ని పక్కనబెట్టాలంటూ అతని చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది.
జట్టులో క్రికెటర్లు మ్యాచ్ లు జరిగే సమయాల్లో లేదా టూర్లకు వెళ్లే సమయాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేందుకు వీల్లేగుండా బీసీసీఐ తాజాగా ఎస్వీపీ జారీ చేసింది. అయితే అత్యవసర పరిస్ధితుల్లో వీటి నుంచి క్రికెటర్లకు మినహాయింపు ఇస్తామని అందులో పేర్కొంది. దాన్ని సాకుగా చూపుతూ తన భార్యతో కలిసి త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల వేదికలకు వెళ్తానంటూ టీమిండియాలో ఓ సీనియర్ క్రికెటర్ బీసీసీఐని కోరాడు. దీన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం టోర్నీలకు తమ కుటుంబ సభ్యుల్ని తీసుకుని వెళ్లడం నిషేధం. అయితే వారు వ్యక్తిగతంగా మాత్రం మ్యాచ్ లు చూసేందుకు రావచ్చు. కానీ అలా కాకుండా తనతో పాటు తన భార్యను తీసుకెళ్తానని సదరు క్రికెటర్ కోరడంతో బీసీసీఐ నిరాకరించింది. అయితే ఈ సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ లేదా విరాట్ కొహ్లీ అయి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. తమ కోసం నిబంధనల్ని సడలించాలంటూ బీసీసీఐని అడిగే స్ధాయిలో ఉన్న టీమిండియా సీనియర్లు వీరేనని తెలుస్తోంది. అయితే వీరి విషయంలోనూ వెనక్కి తగ్గేందుకు బీసీసీఐ నో చెప్పేసింది. దీంతో చేసేది లేక ఒంటరిగానే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications