Virat Kohli బిగ్ యూటర్న్..?!
టెస్ట్ క్రికెట్ లో ఎదురే లేదనుకున్న భారత జట్టుకు చుక్కలు చూపించింది దక్షిణాఫ్రికా. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లల్లో భారత్ లో భారత్ ను మట్టికరిపించింది. ఈ సిరీస్ ను 0-2 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ లో 124 పరుగులను కూడా అందుకోలేక చతికిలపడిన టీమిండియా.. రెండో టెస్ట్ లో ఏకంగా 400లకు పైగా పరుగులతో తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగుల వరద పారించిన పిచ్ పై టీమిండియా బ్యాటర్లు కుప్పకూలిపోయారు.
ఈ ఓటమి- టీమిండియా బ్యాటర్ల బలహీనతను ఎత్తిచూపింది. ఏ ఒక్కరిలో కూడా సుదీర్ఘ ఇన్నింగ్ ఆడాలనే ఓపిక లేదనే విషయాన్ని ఎత్తిచూపింది. దీంతో బీసీసీఐ అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం కానుంది. టెస్ట్ ఫార్మట్ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీని మళ్లీ వెనక్కి పిలిపించాలని భావిస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా వంటి ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోవడం, సుదీర్ఘ ఇన్నింగ్ ఆడగలిగే సత్తా ఉన్నవాళ్లు రిటైర్ కావడం, యువ ఆటగాళ్లతో నిండిపోవడం వంటివి.. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమికి ప్రధాన కారణమని గంభీర్ ఫైనల్ గా తేల్చాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో- అనుభవజ్ఞుల అవసరం ఉందని బీసీసీఐకి వెల్లడించాడనే ప్రచారం జరుగుతోంది.
గత సంవత్సరం గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్.. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అంతకుముందు, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే జట్టులో చోటు కోల్పోయారు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత తక్కువ అనుభవంతో ఉందని, స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు కూడా వారికి కలిసి రాలేదని తెలుస్తోంది. దీంతో రిటైర్ అయిన వారిని ప్రత్యేకించి- విరాట్ కోహ్లీని వెనక్కి పిలిపించాలని బీసీసీఐ భావిస్తోంది.












Click it and Unblock the Notifications