Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫైనల్స్ చూడొద్దు ప్లీజ్: అమితాబ్ బచ్చన్ కి క్రికెట్ లవర్స్ విజ్ఞప్తి!!

ప్రస్తుతం ఎవరి నోట విన్నా క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ కప్ మనదే అని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ కు భారత క్రికెటర్లు ప్రస్తుతం దిగ్విజయంగా చేరుకున్నారు. రేపు ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ సాధించే తీరాలని క్రికెటర్ల లోనే కాదు, భారత ప్రజలలోను పట్టుదల పెరిగింది.

ఇక ఇదే సమయంలో ప్రపంచకప్ ను భారత్ గెలవాలని ఇప్పటికే క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేయిస్తున్నారు. రేపు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను మాత్రం క్రికెట్ చూడొద్దంటూ క్రికెట్ అభిమానులు ప్రాధేయ పడుతున్నారు.

Cricket lovers appeal to Amitabh Bachchan; dont watch the finals of world cup 2023: !!

ఆయన క్రికెట్ వీక్షిస్తే భారత్ ఓడిపోయే ప్రమాదం ఉంటుందన్నది వారి నమ్మకం. అయితే ఈ అభిప్రాయానికి క్రికెట్ అభిమానులు రావడానికి అమితాబ్ బచ్చన్ నే ప్రధాన కారణం. అసలు వారికి ఈ అభిప్రాయం కలగడం వెనుక అమితాబ్ ఏం చేశారంటే.. ఇటీవల సెమీస్ లో కివీస్ పై టీమిండియా విజయం సాధించిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ చేశారు.

"నేను చూడనప్పుడే మనం గెలుస్తాం" అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఆయన చేసిన ట్వీట్ ఫలితమే.. బాబ్బాబు నువ్వు పొరపాటున కూడా క్రికెట్ చూడకు అంటూ అమితాబ్ బచ్చన్ క్రికెట్ లవర్స్ కోరుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని, అలా గెలవాలంటే అమితాబ్ క్రికెట్ చూడకూడదని వారు కోరుతున్నారు.

జట్టు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేరా అంటూ అమితాబ్ ట్వీట్ చేస్తున్నారు. ఇక దీంతో అమితాబ్ బచ్చన్ "ఆ మ్యాచ్ కు వెళ్లాలా వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా" అని ట్విట్టర్ వేదికగా మరోమారు పోస్ట్ చేశారు. టీమిండియా ఆడేటప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్ పాటిస్తారని 2011లో ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+