ముందుంది మరో మెగా టోర్నమెంట్..!!
బెంగళూరు: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేయగా.. ఈ కొండంత లక్ష్యాన్ని నెదర్లాండ్స్ అందుకోలేకపోయింది. 47.5 ఓవర్లల్లో 260 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్‌లో తెలుగబ్బాయి తేజ నిడమానూరు 54 పరుగులు చేశాడు.

ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.
2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి బాటలు వేసింది ఈ వరల్డ్ కప్ 2023. ఇందులో పాయింట్ల పట్టికలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. 2025లో పాకిస్తాన్‌లో జరిగే టోర్నమెంట్ ఇది. ఆ దేశం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్.. దీనికి అర్హత సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా ఈ టోర్నీకి అర్హత సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘన్ క్రమంగా మేటి జట్టుగా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ వరల్డ్ కప్‌లో ఎనిమిది పాయింట్లను సాధించడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో నెగ్గింది ఆప్ఘన్. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించింది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్.. ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.












Click it and Unblock the Notifications