T20 World Cup 2024 Winner: టీ 20 వరల్డ్ కప్ విజేత ఎవరో చెప్పేసిన డఫాబెట్..!
ఈసారి అమెరికా, కరేబియన్ దీవులు ఆతిధ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ (టీ20 వరల్డ్ కప్)ను ఎవరు ఎగరేసుకుపోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్ కు సహకరించని పిచ్ లపై పరుగుల కోసం మేటి జట్లు శ్రమిస్తున్న వేళ చిన్న జట్లు అద్భుత విజయాలు నమోదుచేసుకున్నాయి. ఇదే ఇప్పుడు అగ్రశ్రేణి జట్లను కలవరపెడుతోంది. టోర్నీలో ఇప్పటివరకూ ఓటమి ఎరుగని జట్లలో టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా కూడా ఉన్నాయి. మరోవైపు ఆప్ఘన్, ఇంగ్లండ్ జట్లూ టైటిల్ కోసం తపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెమీఫైనల్లో ఏం జరగబోతోంది, ఫైనల్లో ఎవరు విజేతగా నిలవబోతున్నారనే ఉత్కంఠ పెరిగిపోతోంది.
భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు జరిగే టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో ఆప్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. అలాగే రాత్రి 8 గంటలకు జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. ఈ రెండు సెమీఫైనళ్లలో విజేతలుగా నిలిచిన జట్లు పైనల్లో 29న అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఇందులో భారత్, దక్షిణాఫ్రికా జట్లకు ఫైనల్ చేరే, టైటిల్ గెలిచే సత్తా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈసారి టీ20 వరల్డ్ కప్ విజేతపై కూడా పలువురు మాజీ క్రికెటర్లు, సంస్థలు తమ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ విజేతపై ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ డఫాబెట్ కూడా తన అంచనాలను వెల్లడించింది. ఇందులో ఈసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకునే అవకాశం భారత్ కే ఉందని తేల్చిసింది. ఈ ఐసీసీ మెగా టోర్నీలో రోహిత్ సేన జైత్రయాత్రను దృష్టిలో ఉంచుకుని చూస్తే ప్రస్తుతానికి ఆ జట్టుకే టైటిల్ ఎగరేసుకుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
భారత్ తర్వాత వరుస విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికాను తన రెండో టైటిల్ ఫేవరెట్ గా డఫాబెట్ తేల్చింది. అలాగే దక్షిణాఫ్రికా తర్వాత ఇంగ్లండ్ కు మూడో ఫేవరెట్ స్ధానం ఇచ్చింది. తొలి సెమీస్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా, రెండో సెమీస్ లో ఫేవరెట్ గా మారిన భారత్ తో పోలిస్తే భారత్ పై గెలిస్తేనే ఫైనల్ కు చేరే అవకాశం ఉన్న ఇంగ్లండ్ కు మూడో ఫేవరెట్ గా మాత్రమే డఫాబెట్ అంచనా వేస్తోంది. ఈ మూడు జట్లతో పోలిస్తే ఆప్ఘన్ కు టైటిల్ గెలుపు అవకాశం తక్కువే అంటోంది.












Click it and Unblock the Notifications