ఆ ఇద్దరు టీమ్ ఇండియా స్టార్ల తలరాతలు మార్చేసిన 2025..!

టీమ్ ఇండియా క్రికెట్లో ఈ ఏడాది పలు విజయాలు అందుకుంది. అలాగే పరాజయాలూ చవిచూసింది. అయితే వీటన్నింటినీ మించి వార్తల్లో నిలిచిన రెండు పేర్లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియా విజయాల్లో కీలకంగా నిలిచిన ఆ ఇద్దరు క్రికెటర్లు ఈ ఏడాది మాత్రం ఒడిదుడుకులు చవిచూశారు. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది ఘనంగానే ఆరంభించిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు మధ్యలో ఆటుపోట్లు ఎదుర్కున్నా చివరికి ఈ ఏడాదిని మాత్రం ఘనంగానే ముగిస్తున్నారు. ఆ ఇద్దరే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లేని టీమ్ ఇండియాను ప్రస్తుత రోజుల్లో ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే దశాబ్దానికి పైగా టీమ్ ఇండియా విజయాల్లో కీలకంగా ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది జట్టులో తమ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నారు. దీని వెనుక ప్రధాన కారణాలు చూస్తే టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పడం, ఇక మిగిలిన వన్డే ఫార్మాట్లోనూ వరుస వైఫల్యాలు చవిచూడటం. దీంతో వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అంటూ బీసీసీఐ వీరిద్దరికీ అల్టిమేటం ఇవ్వడం మొదలుపెట్టింది.

Did 2025 Break or Make Them Revisiting Rohit Sharma and Virat Kohli s Pivotal Year

ఒకప్పుడు టెస్టు, టీ20 జట్లలో తమ అసాధారణ బ్యాటింగ్ తో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ-విరాట్ కొహ్లీ జోడీ ఈ ఏడాది మాత్రం వాటికి గుడ్ బై చెప్పేసి వన్డే క్రికెట్ కే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ వన్డే ఫార్మాట్ లో అయినా నిలకడగా రాణించారా అంటే అదీ లేదు. దీంతో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. విరాట్ కొహ్లీ కెరీర్ సైతం ప్రమాదంలో పడింది. దీంతో వీరిద్దరూ తప్పక రాణించాల్సిన సిరీస్ ల్లో ఒత్తిడి పెరిగిపోయి వైఫల్యాలు ఎదుర్కొన్నారు.

Did 2025 Break or Make Them Revisiting Rohit Sharma and Virat Kohli s Pivotal Year

వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ జట్టులో స్ధానం నిలుపుకుంటే ఆటోమేటిగ్గా సెలక్టర్లు తమను ఎంపిక చేస్తారని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీకి మీద పడుతున్న వయస్సు ప్రభావం కనిపిస్తోంది. గతంలోలా వీరిద్దరూ చురుగ్గా మైదానంలో కదలలేకపోతున్నారు. అంతే కాదు యువ బౌలర్లను ఎదుర్కోవడంలో వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అయినా జట్టులో చోటు కావాలంటే ఆడక తప్పని పరిస్ధితుల్లో తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కాస్త ఫలించాయి. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో వీరిద్దరూ మెరుగ్గానే రాణించారు. అయితే వచ్చే ఏడాది వీరిద్దరి కెరీర్ కొనసాగాలంటే మాత్రం అసాధారణ ప్రదర్శనలు ఇవ్వక తప్పని పరిస్ధితుల్లో ఉండటం అభిమానుల్ని కలవరపెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+