కోహ్లీకి ఇంతకంటే ఏం కావాలి - రిషి సునాక్‌‌ కు మోదీ గిఫ్ఠ్ చూస్తే..!!

క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ప్రపంచ కప్ మేనియాతో ఊగిపోతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ విరాట్ ఆట..రికార్డుల పైన భారీ అంచనాలతో ఉన్న సమయంలో మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. భారత్ ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సనాక్ క్ దీపావళి గిఫ్ఠ్ పంపారు. విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను మోదీ పంపటం..దానిని చూడగానే రిషి సనాక్ సంతోషంలో మునిగిపోయారు. కోహ్లీకి ఇంతకంటే అరుదైన గౌరవం ఏం కావాలి అంటూ ఈ వీడియోను కోహ్లీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

బ్రిటన్ ప్రధానికి మోదీ గిఫ్ట్:యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటిస్తోన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌.. ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌‌ను కలిసారు.తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ పంపిన దీపావళి కానుకలు గణపతి విగ్రహం, భారత్‌స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను సునాక్‌కు అందజేశారు. గణపతి విగ్రహం తో పాటుగా విరాట్ సంతకం చేసిన బ్యాట్ ఇవ్వటం సందర్బోచితంగా ఉందని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

EAM Jaishankar reportedly presented Rishi Sunak with a Lord Ganesha statue and a cricket bat signed by Virat Kohli

కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ తో:రిషి సునాక్, జైశంకర్‌ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు జైశంకర్ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. దీపావళి రోజున ప్రధానమంత్రి రిషి సునాక్ తనను ఆహ్వానించటం ఆనందగా ఉందని జైశంకర్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. భారత్, యూకేలు సమకాలీన కాలానికి సంబంధించిన సంబంధాలను పునర్నిర్మించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. సునాక్ దంపతులను హృదయపూర్వక ఆదరణ, ఆత్మీయతతో కూడిన ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

సరైన సమయంలో అరుదైన గిఫ్ట్:అయితే, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యూకేలో నవంబర్‌ 15 వరకు అధికారిక పర్యటన కొనసాగనుంది. ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్‌-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ అటు టీమిండియా సెమీస్ చేరిన వేళ న్యూజీలాండ్ తో కీలక సమరానికి సిద్దమైంది. ఈ సమయంలో కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను బ్రిటన్ ప్రధానికి పంపటం ద్వారా మరసారి ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా సామర్ధ్యానికి గుర్తింపు దక్కేలా చేసారనే పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+