కివీస్‌ను ముంచిన ఇంగ్లాండ్.. పాకిస్థాన్‌కు చిగురించిన ఆశలు!
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. న్యూజిలాండ్ సెమీస్ చేరే నేరుగా అవకాశాన్ని చేజార్చుకుంది. ఆసక్తికరంగా కివీస్ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు మళ్లీ చిగురించాయి.
న్యూజిలాండ్ పోరాటం
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఎవరూ భారీ స్కోరు చేయలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్ (39), టిమ్ సీఫెర్ట్ (35), ఫిన్ అలెన్ (29) పరుగులతో రాణించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 54 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్‌ను ఇంగ్లాండ్ స్పిన్నర్లు దెబ్బతీశారు.

ఇంగ్లాండ్ స్పిన్నర్ల మాయాజాలం
తొలుత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లపై కివీస్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్ ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పిన్నర్లను రంగంలోకి దింపి గేమ్‌ను మార్చేశారు. ప్రమాదకరంగా మారుతున్న సీఫెర్ట్‌ను ఆదిల్ రషీద్ అద్భుతమైన బంతితో బురిడీ కొట్టించి స్టంప్ అవుట్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్‌లు మధ్య ఓవర్లలో కివీస్ బ్యాటర్లను కట్టడి చేస్తూ తలో రెండు వికెట్లు తీశారు. స్పిన్ త్రయం (జాక్స్, రషీద్, రెహాన్) చెరో రెండు వికెట్లతో న్యూజిలాండ్ స్కోరును నియంత్రించారు.
ముగిసిన మ్యాచ్.. మారిన సమీకరణాలు!
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, ఆఖరి ఓవర్ వరకు పోరాడి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో న్యూజిలాండ్ నేరుగా సెమీస్ వెళ్లే ఛాన్స్ పోగొట్టుకుంది. దీనివల్ల గ్రూప్‌లో పాయింట్ల పట్టిక సంక్లిష్టంగా మారింది. కివీస్ ఓటమి పాకిస్థాన్‌కు ఒక చిన్న అవకాశాన్ని కల్పించింది. తదుపరి మ్యాచ్‌లలో వచ్చే ఫలితాలపై పాక్ సెమీస్ భవితవ్యం ఆధారపడి ఉంది. రేపు శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ తేడాతో విజయం సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశం లభిస్తుంది. అంటే నెట్ రన్ రేట్‌పై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications