రోహిత్ చెత్త బ్యాటింగ్ తో కెప్టెన్సీపైనా ఎఫెక్ట్-మాజీ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ఫైర్..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే స్వదేశంలో కివీస్ తో జరిగిన టెస్టు సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు ఆస్ట్రేలియాలోనూ చుక్కలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రతీ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ పేలవంగా ఆడి పెవిలియన్ చేరుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్ బోర్న్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తర్వాత ఓపెనర్ గా మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ .. కేవలం ఐదు బంతుల్లోనే మూడు పరుగులు చేసి అవుటయ్యారు. కమ్మిన్స్ బౌలింగ్ లో బోలాండ్ కు క్యాచ్ ఇచ్చి రోహిత్ అవుట్ కావడం అభిమానుల్ని నిరాశపర్చింది. అదే సమయంలో కామెంట్రీ బాక్సులో ఉన్న భారత మాజీ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. తోడి కామెంటేటర్ మార్క్ నికోలస్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.

former chief selector mks prasad blames Rohit sharma s failures says impacting captaincy too

రోహిత్ పేలవంగా అవుట్ కావడంపై మార్క్ నికోలస్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎమ్మెస్కే.. అవును అతని ఫామ్ జట్టు కెప్టెన్సీపైనా ప్రభావం చూపుతోందన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ తో పాటు గతంలో స్వదేశంలో కివీస్ తో జరిగిన సిరీస్ లోనూ బ్యాక్ టూ బ్యాక్ మ్యాచ్ లు భారత్ కోల్పోవడం దారుణమని ఎమ్మెస్కే తెలిపాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదన్నారు. దానికి కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీయే అన్నాడు.

కివీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో వరుసగా 2, 52,0,8, 18, 11 పరుగులు స్కోర్ చేసిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టెస్టు ఆడలేదు. రెండో టెస్టులో బరిలోకి దిగినా వర్షం కారణంగా అది కాస్తా డ్రాగా ముగిసింది. ఇప్పుడు మూడో టెస్టులో మూడు పరుగులే చేసి వెనుదిరిగాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+