పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. టీ20 వరల్డ్ కప్ లో విఫలం కావడం, అనంతరం బంగ్లాదేశ్ తో ఆడిన సిరీస్ ను 2-1 తేడాతో ఓడిపోవడం మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలి పట్లా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన ఈ జట్టు క్రమంగా అథఃపాతాళానికి పడిపోతోండటం అటు క్రికెట్ అభిమానులను సైతం నివ్వెరపరుస్తోంది. ఇప్పట్లో కోలుకులేని విధంగా తయారవుతుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తాజాగా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఘాటు విమర్శలు చేశారు. జట్టు సాధారణ కార్యకలాపాల్లో కూడా బోర్డు విపరీతంగా జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. జట్టుపై పెత్తనం సాధించడంలో భాగంగా బోర్డులో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని విమర్శించారు. మొహసిన్ నఖ్వీ నేతృత్వంలోని ఈ గందరగోళ వ్యవస్థలో ఏ కోచ్ అయినా విజయం సాధించడం అసాధ్యమని తేల్చి చెప్పారు.

సనత్ జయసూర్య తర్వాత శ్రీలంక హెడ్ కోచ్‌గా కిర్‌స్టన్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా టాక్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అనేక విషయాలను ప్రస్తావించారు. 2024లో పాకిస్తాన్ హెడ్ కోచ్ గా కిర్ స్టన్ అపాయింట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారాయన. ఆరు నెలల్లోనే రాజీనామా చేశారు. అతని సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ఒక్క వన్డే కూడా ఆడకుండా తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు.
జట్టు కార్యకలాపాల్లో బోర్డు నిరంతర జోక్యం, కనీస గౌరవం ఇవ్వకపోవడం వంటి పరిణామాలు అక్కడి వర్క్ కల్చర్ ను విషపూరితంగా మార్చివేసిందని కిర్ సెన్ అన్నారు. ఎటువంటి ప్లేయర్ అయినా ఆ జట్టు హెడ్ కోచ్ గా రాణించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. "ఇతర విషయాల కన్నా తనను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశం బోర్డు జోక్యం. ఈ స్థాయిలో జోక్యాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది.." అని కిర్‌స్టన్ అన్నారు.
పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బోర్డు.. కోచింగ్ స్టాఫ్ ను బలిపశువులను చేసేదని కిర్‌స్టన్ వివరించారు. జట్టు ఓటమిపాలైనప్పుడు ప్లేయర్లు, హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కు అండగా ఉండటానికి బదులు ఆంక్షలు విధించేదని తప్పుపట్టారు. "బోర్డు నుంచి నిరంతరం ఇబ్బందులు ఉన్నప్పుడు, కోచ్ వచ్చి ఆటగాళ్లతో కలిసి పనిచేయడం కష్టం. ఇది కష్టమైనది, చెత్త ప్రదర్శనలకు శిక్షాత్మక చర్యలు ఉండేవి" అని ఆయన తెలిపారు.
2024 టీ20 ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ నిష్క్రమించిన తర్వాత అధికార పోరాటాలే కిర్‌స్టన్ రాజీనామాకు కారణం. జట్టు ఫిట్‌నెస్, మానసిక విధానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన అధికారాలకు కోత పెట్టింది బోర్డు. ఎంపిక కమిటీపై ప్రధాన కోచ్ ఓటు హక్కులను పీసీబీ తొలగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సమయంలో కిర్‌స్టన్‌కు తెలియకుండా జట్టును ఎంపిక చేయడం, మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications