ODI Worldcup 2023 : వరల్డ్ కప్ లో బాబర్ తో జాగ్రత్త-సెంచరీల మోతే-గౌతం గంభీర్ అంచనా..
త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మెగా టోర్నీలో స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెలువరిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది కాలంగా వన్డేలో నిలకడగా రాణిస్తున్న పలువురు క్రికెటర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే క్రమంలో ఒకప్పటి టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ తాజాగా వరల్డ్ కప్ పై తన అంచనాలు వెల్లడించాడు.
ఇందులో గౌతం గంభీర్ భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చెలరేగే అవకాశం ఉందని అంచనా వేశాడు. ముఖ్యంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం బ్యాటింగ్ టెక్నిక్‌తో అద్భుతంగా ఆకట్టుకున్నాడని తెలిపాడు. రెండుసార్లు ప్రపంచకప్ విజేత అయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. భారత్‌లో పరుగుల వరద పారించడం ఖాయమన్నాడు. బాబర్ అజామ్ టెక్నిక్ ఎంతో మెరుగ్గా ఉందన్నాడు.

బాబర్ ఈ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు తరఫున మూడు లేదా నాలుగు సెంచరీలు సాధిస్తాడని తాను అంచనా వేస్తున్నట్లు గౌతం గంభీర్ తెలిపాడు. ఇటీవల గంభీర్ భారత ఉపఖండపు పిచ్ లపై బాబర్ బ్యాటింగ్ ను ప్రస్తావిస్తూ వన్డే వరల్డ్ కప్ లోనూ అతను అంచనాలకు మించి రాణిస్తాడన్నాడు. ఇప్పటికే ప్రపంచకప్‌లో మూడో వార్మప్ గేమ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సారథి బాబర్.. 84 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. తిరువనంతపురంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుండగా, బాబర్ నేతృత్వంలోని పాకిస్థాన్ మంగళవారం హైదరాబాద్‌లో తన చివరి వార్మప్ గేమ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
మరోవైపు నెదర్లాండ్స్‌తో తదుపరి వార్మప్ మ్యాచ్‌కు ముందు సిద్దమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మపైనా గౌతం గంభీర్ తన అంచనాల్ని వెల్లడించాడు. 58.42 సగటుతో ఉన్న భారత ఆల్-ఫార్మాట్ కెప్టెన్ రోహిత్.. స్వదేశంలో 80 వన్డేల్లో 4,148 పరుగులు చేశాడు. స్వదేశంలో రోహిత్ శర్మ రికార్డు గురించి మనందరికీ తెలిసిందేనని, అతని ఖాతాలో ఇప్పటికే నాలుగు డబుల్ సెంచరీలు ఉన్నాయన్నాడు. కాబట్టి అతను నిజంగా ఈ వరల్డ్ కోసం ఎదురు చూస్తున్నాడని ఖచ్చితంగా చెప్పగలనని గంభీర్ తెలిపాడు.












Click it and Unblock the Notifications