ఓటమి ఫ్రస్ట్రేషన్ మొత్తాన్నీ అతని మీద చూపించిన కేప్టెన్ సాబ్
GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ ఈ ఇన్నింగ్‌లో. 41 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు కొట్టాడు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 38, టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ బట్లర్- 39 పరుగులతో రాణించారు. మిడిలార్డర్‌లో షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 18 పరుగులు తప్ప మిగిలిన వాళ్లు చేసింది సింగిల్ డిజిట్టే.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన రిప్పర్‌కు అతని వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్ సైడ్ స్టంప్‌కు కాస్త అవతల పిచ్ అయి వికెట్ల మీదికి దూసుకొచ్చిన ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు రోహిత్.
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో బ్యాటింగ్ భారం మొత్తాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మోయాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇన్నింగ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్ ఆడాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి.
36 బంతులను ఎదుర్కొన్న తిలక్ వర్మ చేసింది 39 పరుగులే. ఇందులో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్‌తో పోటీపడుతూ దూకుడుగా ఆడివుంటే పరిస్థితి ఖచ్చితంగా మరోలా ఉండేదే. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలుండేది.
లోయర్ ఆర్డర్‌లో ఆదుకుంటాడని భావించిన కేప్టెన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం చేతులెత్తేయడం ముంబై ఇండియన్స్ ఓటమికి బాటలు వేసినట్టయింది. ఏకంగా 17 బంతులను ఎదుర్కొని అతను చేసిన పరుగులు 11. ఇందులో ఒకే ఒక్క ఫోర్. రాబిన్ మిన్జ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.
ఓటమి ఖాయమని తేలిపోవడంతో హార్దిక్ పాండ్యా అసహనానికి లోనయ్యాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్‌తో గొడవ పడ్డాడు. 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి కిశోర్ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్ మూడో బంతిని హార్దిక్ పాండ్యా ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు. అతని ఇన్నింగ్‌లో నమోదైన బౌండరీ అదొక్కటే.
ఆ మరుసటి బంతిని హార్దిక్ పాండ్యా డిఫెన్స్ ఆడాడు. ఆ బంతిని షాట్ ఆడలేకపోవడం పాండ్యాను కొంత ఫ్రస్ట్రేషన్‌కు గురి చేసినట్టయింది. సాయి కిశోర్ వైపు కోపంగా చూశాడు. అతని వైపు దూసుకొచ్చాడు. సాయి కిషోర్ కూడా వెనక్కి తగ్గలేదు. నువ్వెంత.. అన్నట్టు బదులిచ్చాడు. దీన్ని గమనించిన అంపైర్ జోక్యం చేసుకున్నారు. వారిద్దరినీ వెనక్కి పంపించారు.
మ్యాచ్ అనంతరం వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా నవ్వుతూ హగ్ చేసుకున్నారు. ఈ గొడవపై సాయి కిషోర్ స్పందించాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నానని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థుల్లాగే ఉంటామని, ఇక్కడ జరిగేవి వ్యక్తిగతంగా తీసుకోబోమని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications