పిచ్చ కొట్టుడు కొట్టారు : రోహిత్, హార్దిక్ అభిమానుల ఫైటింగ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం గుజరాత్, ముంబై మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబైపై గుజరాత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా గౌరవించలేదనే మాటలు తెరపైకి వస్తున్నాయి. ఫీల్డింగ్ విషయంలో రోహిత్‌ను హార్దిక్ పదేపదే బౌండరీ లైన్ వద్దకు పంపించడం కనిపించింది.
దీంతో హార్దిక్ పాండ్యా పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు స్టేడియంలో హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హార్దిక్ పాండ్యా గర్వం పెరిగిపోయిందని..అతను ముంబై జట్టుకు కెప్టెన్ గా పనికిరాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు గుజరాత్‌పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమని ఆరోపిస్తూ రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్ మైదానంలో హార్దిక్ అభిమానులపై రోహిత్ అభిమానులు దాడికి దిగారు. హార్దిక్ అభిమానులు కూడా ప్రతిదాడికి దిగడంతో అక్కడ యుద్ధ వాతావరణం తలపించింది.
Rohit sharma fan got beaten🌶️ by Hardik Pandya devotees in yesterday match🥳😍😍.
— Praneeth (@fantasy_d11) March 25, 2024
Imagine what will happen if Rohit sharma himself came in front of us💥🤟🏻 pic.twitter.com/M0MRxziH0Y
దీంతో ఇరువురు క్రికెటర్లకు చెందిన అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications