రోహిత్ సేనకు గుడ్ న్యూస్: కమ్మిన్స్ అవుట్?
Rohit Sharma: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కేప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరం అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా అతను ట్రోఫీ ఆడకపోవచ్చు. అదే జరిగితే- డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ లేదా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లల్లో ఒకరికి కేప్టెన్సీ క్యాప్ దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి.
కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు కమ్మిన్స్. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌తో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నుంచీ అతను ఇబ్బంది పడుతోన్నాడు. ఆ ట్రోఫీ తరువాత మరే సిరీస్‌కు అందుబాటులో లేడు. రెండో బిడ్డ జన్మించిన కారణంగా శ్రీలంకతో సిరీస్ నుంచీ తప్పుకొన్నాడు కమ్మిన్స్. తొలి రెండు వన్డేలకూ స్కిప్ అయ్యాడు.
అదే సమయంలో మడమ నొప్పి తిరగబెట్టిన నేపథ్యంలో సిరీస్ మొత్తానికీ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడకపోవచ్చని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని, ఇంకో రెండు రోజుల్లో స్పష్టత రావొచ్చని చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే ఆస్ట్రేలియా జట్టులో- పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications