Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ ఆడబోయే సెమీ ఫైనల్స్‌కు 2 గంటలు ఎక్స్‌ట్రా టైమ్: వర్షం పడితే ఏమౌతుంది?

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.

టేబుల్ టాపర్‌గా..:ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.

 ICC World Cup 2023, IND vs NZ 1st Semi Final: What Happens If rain Plays spoilersport?

హాట్ కేకుల్లా టికెట్స్..:ఈ నెల 15, 16 తేదీల్లో ఈ రెండు సెమీ ఫైనల్స్ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి సెమీ ఫైనల్.. భారత్- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో.. రెండోది దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నాయి.

పిచ్ ఎలా ఉంది..?:

వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పరుగుల వరద పారడానికి సహకరించే పిచ్ ఇది. బౌండరీ రేడియస్ తక్కువే. సులువుగా ఫోర్లు, సిక్సర్లు బాదేయవచ్చు. బౌలింగ్ పరంగా చూస్తే ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. రెండోసారి ఫీల్డింగ్ ఎంచుకునే జట్టు బౌలర్లకు అనుకూలిస్తుంది.

బ్యాటింగ్ యావరేజ్ ఎంత..?:ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్.. 261 పరుగులు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే అధిక మ్యాచ్‌లను గెలిచింది కూడా. ఈ 14 మ్యాచ్‌లల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. ఛేజింగ్‌ టీమ్ 13 సార్లు విజయాన్ని రుచి చూసిందిక్కడ. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన రికార్డు దక్షిణాఫ్రికాపై ఉంది. 2015లో భారత్‌పై నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేశారు సఫారీలు.

వాతావరణం ఎలా ఉంది?:బుధవారం ముంబైలో సాధారణ వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అక్యుట్ వెదర్ తెలిపింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 44గా రికార్డవుతుంది. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు లేవు.

 ICC World Cup 2023, IND vs NZ 1st Semi Final: What Happens If rain Plays spoilersport?

వర్షం పడితే ఏమౌతుంది?:వర్షం పడితే- మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయం అంటే రెండు గంటల ఎక్స్‌ట్రా సమయం అందుబాటులో ఉంటుంది. వాతావరణం లేదా ఏదైనా ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా అంతరాయం ఏర్పడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

బెనిఫిట్ ఏంటీ?:నిర్దేశిత 2 గంటలు దాటినా మ్యాచ్ ఆరంభం కాకపోతే అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరిస్తారు. ఉదాహరణకు- మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు నిలిచిపోయిందనుకుందాం. రాత్రి 8 గంటలకు మళ్లీ మొదలైతే- ఓవర్ల కుదింపు ఉండదు. యధాతథంగా కొనసాగుతుంది. అప్పటికీ మ్యాచ్ మొదలు కాలేకపోయినప్పుడే డక్‌వర్త్ లూయిస్ విధానాన్నిఅనుసరిస్తారు. ప్రతి అయిదు నిమిషాలకు ఒకటి చొప్పున ఓవర్‌ను కుదిస్తారు.

రిజర్వ్ డే ఉందా? :ఈ రెండు సెమీ ఫైనల్స్‌కు కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. 15వ తేదీన మ్యాచ్ పూర్తిగా రద్దయితే 17వ తేదీన రిజర్వే డే నాడు మళ్లీ ఆడొచ్చు. 16వ తేదీన జరిగే రెండో సెమీ ఫైనల్స్ వర్షం వల్ల లేదా అనివార్య కారణాల వల్ల రద్దయితే 18వ తేదీన రిజర్వ్ డే నాడు మళ్లీ ఆడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+